Inspiring story: పానీపూరీలు అమ్ముతూ ఇస్రోలో జాబ్ కొట్టాడు

Published : May 28, 2025, 05:08 PM IST
inspirational story: Golgappa seller Ramdas Marbade becomes ISRO technician in Sriharikota in Telugu rma

సారాంశం

Inspiring stories: మహారాష్ట్రకు చెందిన యువకుడు రామదాస్ మర్బాడే పానీపూరీలు అమ్ముతూ చదువుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట స్పేస్ సెంటర్లో ఉద్యోగం సాధించాడు. అతని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

inspirational story: మహారాష్ట్రలోని గోండియా జిల్లా, తిరోడా తాలూకా ఖైరబోడి అనే చిన్న గ్రామానికి చెందిన రామదాస్ హేమ్రాజ్ మర్బాడే జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన రామదాస్.. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు.

అతని ఈ విజయం వెనుక ఉన్న కథ ఎంతో ప్రేరణాత్మకం. కుటుంబాన్నిపోషించడానికి, తన చదువులకు డబ్బు కూడబెట్టడానికి రామదాస్ చిన్నప్పటి నుంచే పానీపూరీలు అమ్మేవాడు. పగటిపూట చిన్న బండిపై పానీపూరీలు పెట్టుకుని తన నివాసం దగ్గరలో ఉన్న గ్రామాల మధ్య తిరుగుతూ అమ్మేవాడు. రాత్రివేళల్లో పుస్తకాలు తీసుకుని చదవడం అతని నిత్యకృత్యంగా ఉండేది.

రామదాస్ తండ్రి డొంగార్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసేవారు. ప్రస్తుతం పదవీ విరమణ పొందారు. తల్లి గృహిణి. రామదాస్ గణేష్ హైస్కూల్, గుమాధవాడలో చదివి, తిరోడాలోని సీజీ పటేల్ కాలేజీలో 12వ తరగతి పూర్తి చేశాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా రెగ్యులర్ డిగ్రీ చదవలేకపోయాడు. కానీ, నాశిక్‌లోని వైసీఎం కాలేజీ ద్వారా ప్రైవేట్‌గా బీఏ పూర్తి చేశాడు. అంతేకాదు, టెక్నికల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో, తిరోడాలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో "పంప్ ఆపరేటర్-కమ్-మెకానిక్" కోర్సులో చేరాడు. అక్కడ అతను సెంట్రిఫ్యూగల్, రిసిప్రొకేటింగ్ పంపుల నిర్వహణ, వాటర్ ట్రీట్మెంట్ టెక్నిక్స్, ఆయిల్ - గ్యాస్ ఎక్విప్‌మెంట్ నిర్వహణ వంటి కీలక నైపుణ్యాలు నేర్చుకున్నాడు.

2023లో ఇస్రో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రామదాస్ దరఖాస్తు చేసుకుని 2024లో నాగ్‌పూర్‌లో నిర్వహించిన రాత పరీక్షను విజయవంతంగా క్లియర్ చేశాడు. అనంతరం 2024 ఆగస్టు 29న శ్రీహరికోటలో నిర్వహించిన స్కిల్ టెస్ట్‌కు హాజరై అద్భుత పనితీరును చూపించాడు. ఈ టెస్ట్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 2025 మే 19న అతను ఇస్రో నుంచి జాయినింగ్ లెటర్‌ను అందుకున్నాడు.

ప్రస్తుతం రామదాస్ ఇస్రోలోని శ్రీహరికోట స్పేస్ సెంటర్లో "పంప్ ఆపరేటర్-కమ్-మెకానిక్"గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కథ యువతకు సంకల్ప బలాన్ని, కృషికి విలువను నేర్పిస్తుంది. ఒక పానీపూరీలు అమ్ముకునే యువకుడు నేడు ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ ఉద్యోగిగా మారిన ఈ ప్రయాణం గోండియా జిల్లాకు గర్వకారణంగా మారింది. కేవలం ఆ ప్రాంతానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువతకు రామదాస్ మర్బాడే విజయం ఒక మార్గదర్శకం.. ఆదర్శం. ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టామనేది ముఖ్యంకాదు.. లక్ష్యం పట్ల నిబద్ధత ఉంటే దానిని సాధించడం సాధ్యమే అని నిరూపించాడు రామదాస్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే