ప్లాస్టిక్ నుంచి భూమిని కాపాడుతూ లక్షలు సంపాదిస్తున్న జంట.. మంచి జాబ్ లు వదిలేసి మరీ వ్యాపారం..

By Mahesh Rajamoni  |  First Published Aug 15, 2023, 7:00 PM IST

ప్లాస్టిక్ భూమిలో కరిగిపోదు. ఇది ఈ భూమినే కాదు నేల పై, సముద్రంపై లో నివసిస్తున్న ఎన్నో జీవుల ప్రాణాలను సులువుగా తీసేయగలదు. కానీ ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. అయితే కేరళకు చెందిన ఓ జంట చేస్తున్న వ్యాపారం ఈ భూమిని కాపాడంతో పాటుగా వారికి లక్షలను తెచ్చిపెడుతుంది. ఇంతకీ ఈ జంట ఏం వ్యాపారం చేస్తోందంటే? 
 


అరెకా తాటి ఆకుల వినియోగం ప్రస్తుతం ప్లాస్టిక్ కు ముప్పుగా మారింది. మీకు తెలుసా? ఒకప్పుడు ప్రజలు అరెకా తాటి ఆకులతో తయారు చేసిన వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. కాని ప్లాస్టిక్ రాకతో వీటి ఉనికే లేకుండా పోయింది. ఏదేమైనా కానీ ప్లాస్టిక్ వాడకం అస్సలు మంచిది కాదు. ఇది ఈ భూమిని నాశనం చేయడంతో పాటుగా.. ఎన్నో ప్రాణులను చంపేయగలదు. ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ వాడకం ఈ భూమికి ముప్పు అని మేధావులు, శాస్త్రవేత్తలు చెబుతున్నా.. దీని వాడకం మాత్రం తగ్గడం లేదు.  అయితే ఓ జంట ఆలోచన ఇప్పుడు కొంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తుందనే చెప్పాలి. గతంలోనూ అరెకా తాటి ఆకు ప్లాస్టిక్ ను తగ్గించే ప్రయత్నం చేసింది. ప్లాంట్ జీవ సామర్థ్యాన్ని గ్రహించిన పలువురు పారిశ్రామికవేత్తలు ఇప్పటికే వీటి తయారీ రంగం ప్రారంభించారు. అయినప్పటికీ ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఇది ముందుకు వెళ్లలేదు. 

కానీ ఓ జంట మాత్రం అరెకా తాటి ఆకులతో రకరకాల వస్తువులను తయారుచేస్తూ మంచి లాభాలను అర్జిస్తున్నారు. వారెవరంటే.. కాసరగోడ్ జంట శరణ్య-దేవకుమార్. మార్కెట్, మార్కెటింగ్ అవకాశాలపై ఎక్కువ పరిజ్ఞానం ఉంటే విజయాన్ని చేరుకోవడం ఎవరూ ఆపలేరని ఈ జంట నిరూపిస్తోంది. ఈ జంట అరెకా తాటి ఆకులతో తయారు చేసిన బ్యాగులు, విందు సామాగ్రిని ఉత్పత్తి చేస్తుంది. మటిక్కల్ పంచాయతీలోని తమ ఇంటి పక్కనే ఉన్న నిర్మాణ స్థలం నుంచి తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం చలక్కడవులో 2000 చదరపు అడుగుల ఉత్పత్తి సౌకర్యం, 4000 చదరపు అడుగుల స్టోరేజ్ ఫెసిలిటీ ని ఇప్పుడు వీళ్లకుంది. 

Latest Videos

దేవకుమార్ నారాయణన్ నాలుగేండ్ల పాటు యూఏఈలో ఉంటూ మంచి జీతమొచ్చే కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. అతని భార్య అతనిదగ్గరికి వచ్చిన కొంతకాలానికే బిజీ లైఫ్ స్టైల్ కు విసిగిపోయారు. ఇంకేముంది ఈ జంట తిరిగి వారి స్వస్థలమైన కేరళకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

అనుకున్నదే తడవుగా ఉన్నత స్థాయి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయాడు. తొలుత సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభించాలని భావించారు. కానీ  ఏ సంస్థను ఎలా? దేనితో ప్రారంభించాలో ఆయనకు అర్థం కాలేదు. ఆదర్శవంతమైన వ్యాపారం ఆర్గానిక్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ కల అరేకా పామాయిల్  కంపెనీతో ఆవిర్భవించిందని ఆయన ఏషియానెట్ న్యూస్ తో  చెప్పారు.

undefined

ఎన్నో వ్యాపార అవకాశాలు ఉండటంతో దేవకుమార్, శరణ్య గ్రామీణ వ్యాపారాల ద్వారా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా మంది ఆ మార్గంలో వెళ్లడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ వ్యాపారాల్లో లాభాలు తక్కువగా వస్తాయని. అరెకా ఆకులతో తయారుచేసిన స్పూన్లు, ప్లేట్లు, గిన్నెలను ఎప్పటి నుంచో ఇండ్లలో వాడుతున్నారు. వీటితో తొట్టెలు వంటి ఎన్నో వస్తువులు కూడా తయారయ్యాయి. ఈ వస్తువులకు బాగా డిమాండ్ ఉంటుందని గ్రహించిన తర్వాతే ఈ వ్యాపారం మొదలుపెట్టినట్టు దేవకుమార్ తెలిపారు.

" అరెకా ఆకుల ఉత్పత్తులు సరిపోతాయని నేను నిర్ణయం తీసుకున్నప్పుడు.. నేను బ్రాండ్ పేరును పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించాను. ఈ పేరు కాన్సెప్ట్ కు సరిపోయేలా, కొంత ప్రాముఖ్యత కలిగి ఉండటం చాలా అవసరం. "లెస్ పేపర్ అండ్ లెస్ ప్లాస్టిక్" అనే పదంతో "పప్లా" ఈ వ్యాపారానికి పేరుపెట్టాం " అని శరణ్య చెప్పారు.

ఎగుమతులకు అవకాశం..

"ప్రాథమిక మెటీరియల్ అయిన అరేకాను స్థానిక పట్టణం నుంచే తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే కర్ణాటక నుంచి కొనుగోలు చేస్తారు. ఉత్పత్తి కేంద్రానికి అత్యధిక గ్రేడ్ ఆకులు మాత్రమే లభిస్తాయి. సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే చెట్టు నుంచి అరెకా ఆకులను పొందొచ్చు. అంటే చెట్టు పూత దశలో ఉన్నప్పుడు మాత్రమే. దీంతో రాబోయే ఆరు నెలలకు మేము కూడా ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది" అని దేవకుమార్ చెప్పారు.

అరెకా ఆకు ప్లేట్లు టేబుల్వేర్ తర్వాత మార్కెట్లో రెండో అత్యంత ప్రాచుర్యం పొందిన ఉత్పత్తి. రోజుకు 10 వేల ప్లేట్ల ఉత్పత్తి జరుగుతోంది. తమ ఉత్పత్తులను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అరెకా ప్లేట్లు ఎక్కువగా ఇజ్రాయిల్ కు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం యూఏఈ, కెనడా, ఖతార్ దేశాలకు కూడా షిప్పింగ్ చేస్తున్నట్టు దేవకుమార్ పేర్కొన్నారు.

వీరిద్దరూ ప్రస్తుతం అరేకా పరిశ్రమలో కొత్త ఉపాధి కోసం వెతుకుతున్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న బ్యాడ్జీలపై స్క్రీన్ ప్రింటింగ్, యూవీ ప్రింటింగ్ కూడా ప్రారంభం కానున్నాయి. పర్యాటక శాఖతో పాటు రైతులు సంప్రదాయబద్ధంగా ధరించే హ్యాండ్ ఫ్యాన్, గ్రో బ్యాగులు, టోపీల ఉత్పత్తిని పెంచాలని ఈ జంట భావిస్తోంది. విలక్షణమైన ఉత్పత్తుల కారణంగా భౌగోళిక సూచిక ముఖ్యమైనది. ప్రభుత్వ సహకారంతో అరెకా తాటి ఉత్పత్తుల తయారీదారుల క్లస్టర్లను ఏర్పాటు చేయడం మరో లక్ష్యం.

click me!