కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

By telugu teamFirst Published Jul 29, 2019, 9:39 AM IST
Highlights

నేడు బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా? తన స్పీకర్ పదవికి ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో... అధికారం బీజేపీ వశమైంది. ఇదిలా ఉండగా... నేడు బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే ఆయన 14మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన ఎమ్మెల్యేపై ఆయన చర్యలు తీసుకున్నారు. ఇంతటితో తన పని పూర్తయిందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఆయన కూటమి స్పీకర్ కాబట్టి... కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఇష్టం లేక.. పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరికీ తగిన బలం లభించలేదు. దీంతో... కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా ఉండటం ఇష్టంలేని దాదాపు 14మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో.... కర్ణాటకలో సంక్షోభం ఏర్పడింది. తర్వాత కుమారస్వామి విశ్వాస పరీక్షలో బలాన్ని నిరూపించుకోలేకపోవడం... బీజేపీ అధికారం చేపట్టిన విషయాలన్నీ మనకు తెలిసినవే.

సంబంధిత వార్తలు

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్

click me!