కన్నడ ప్రతిపక్షనేత ఎవరు: తెరపైకి శివకుమార్.. సిద్ధూకే డౌటేనా..?

By Siva KodatiFirst Published Jul 29, 2019, 8:30 AM IST
Highlights

ప్రతిపక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారనేది పెద్ద పజిల్‌గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేరు వినిపిస్తున్నప్పటికీ.. రెబల్ ఎమ్మెల్యేల వెనుక చక్రం తిప్పింది సిద్ధూనే అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వినిపిస్తుంది

బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి... యడియూరప్ప ముఖ్యమంత్రి కావడంతో కన్నడనాట రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మెజార్టీ సభ్యుల బలంతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయగా... ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా లభించనుంది.

అయితే ప్రతిపక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారనేది పెద్ద పజిల్‌గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేరు వినిపిస్తున్నప్పటికీ.. రెబల్ ఎమ్మెల్యేల వెనుక చక్రం తిప్పింది సిద్ధూనే అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వినిపిస్తుంది.

ఇదే విషయమై రాహుల్ గాంధీ సైతం సిద్ధరామయ్యపై మండిపడినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఆయనకు అవకాశం కష్టమేనని తెలుస్తోంది. అయితే ట్రబుల్ షూటర్‌గా పార్టీని ఎన్నో క్లిష్టసమయాల్లో ఒడ్డున పడేసిన మాజీ మంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఆర్‌వీ.దేశ్‌పాండే, పరమేశ్వర్‌ల పేర్లు కూడా ప్రతిపక్షనేత రేసులో వినిపిస్తున్నాయి.

సోమవారం అసెంబ్లీలో యడియూరప్ప బలనిరూపణ కావడంతో ప్రతిపక్షనేత పదవి అనివార్యం కావడంతో.. తాత్కాలికంగా ఒకరి పేరు సూచిస్తున్నారని కన్నడనాట వార్తలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

click me!