మంత్రి రాసలీలల కేసు..‘మా కూతురి ప్రాణానికి ముప్పు’

By telugu news teamFirst Published Mar 17, 2021, 2:23 PM IST
Highlights

ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెని అపహరించారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక మాజీ మంత్రి రాసలీల కేసులో యువతి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మంత్రి హోదాలో ఉన్న రమేశ్ జార్కిహోళి.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిని మోసగించిన సంగతి తెలిసిందే. కాగా.. యువతితో మంత్రి గడిపినదంతా సీడీ రూపంలో బయటకు రావడంతో.. ఈ ఘటన కలకలం రేగింది.

ఇక వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సదరు యువతి అజ్ఞాతంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెని అపహరించారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు మంగళవారం బెలగావి ఏపీఎంసీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 363, 368, 343, 346, 354, 506ల కింద కేసు నమోదు చేశారు.

అంతేకాక యువతి తల్లిదండ్రులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీనిలో వారు తమ కుమార్తె ప్రమాదంలో ఉందని.. ఆమె ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి తమ కుమార్తెను చూడలేదని తెలిపారు. యువతి తండ్రి బెలగావిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇక చివరి సారి తన కుమార్తెతో మాట్లాడిన సంభాషణను కూడా వెల్లడించారు. టీవీలో ఆ వీడియో ప్రసారం కాగానే తాను తన కుమార్తెకు ఫోన్ చేశానని తెలిపానన్నారు.
 
టీవీలో ఓ వీడియో వస్తుంది.. దానిలో ఉన్న యువతి చూడటానికి అచ్చం తన కూతురిలాగనే ఉందంటూ తాను ఫోన్ చేసినట్లు చెప్పారు. అయితే.. అందులో ఉన్నది తాను కాదని తన కుమార్తె చెప్పిందన్నారు. ఏ తప్పు చేయకుంటే.. ఇంటికి రమ్మని తాను అడిగానని.. అందుకు రాలేను అని చెప్పిందని ఆయన పేర్కొన్నారు. 
ఆ తర్వాత ఓ సారి ‘‘నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను కాంటాక్ట్‌ చేయడానికి ప్రయత్నించకండి’’ అంటూ మెసేజ్‌ చేసింది. అదే తనతో చివరి సంభాషణ. ఆ తర్వాత తన మొబైల్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఆ తర్వాత టీవీలో మరో వీడియో చూశాం. దానిలో నా కుమార్తె తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దాంతో మేం బెల్గాంలో మిస్పింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాం’’ అని తెలిపారు. 

click me!