కర్ణాటక కాంగ్రెస్‌లో హైడ్రామా: న్యూఢిల్లీకి బయలుదేరిన డీకే శివకుమార్

Published : May 16, 2023, 09:24 AM ISTUpdated : May 16, 2023, 09:34 AM IST
   కర్ణాటక కాంగ్రెస్‌లో హైడ్రామా:   న్యూఢిల్లీకి బయలుదేరిన డీకే శివకుమార్

సారాంశం

కర్ణాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ మంగళవారంనాడు  ఉదయం బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు.  నిన్ననే  న్యూఢిల్లీకి  డీకే శివకుమార్ వెళ్లాల్సి  ఉంది.  కానీ  అనారోగ్య కారణాలతో డీకే శివకుమార్  ఢీల్లికి వెళ్లలేదు.

బెంగుళూరు:  కర్ణాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్  మంగళవారంనాడు   బెంగుళూరు నుండి  ఢీల్లీకి బయలుదేరి వెళ్లారు.  సోమవారంనాడే  డీకే శివకుమార్ ను  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  పిలిచింది.  అయితే  ఆరోగ్య కారణాలతో  డీకే శివకుమార్  మాత్రం  ఢీల్లీకి వెళ్లలేదు.  ఇవాళ  ఉదయం  డీకే శివకుమార్  బెంగుళూరు నుండి న్యూఢిల్లీకి బయలుదేరారు.   గత నాలుగు రోజులుగా  కడుపునొప్పితో డీకే శివకుమార్  బాధపడుతున్నారు.  ఈ విషయాన్ని డీకే శివకుమార్  నిన్న  సాయంత్రం  ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కర్ణాటక మాజీ సీఎం  సిద్దరామయ్య  నిన్ననే ఢీల్లికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ  అగ్రనేతలను  సిద్దరామయ్య  కలిశారు.  అయితే  నిన్న  న్యూఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్లలేదు. దీంతో  డీకే శివకుమార్ సోదరుడు  డీకే  సురేష్  నిన్న రాత్రి  ఎఐసీసీ  అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేతో  భేటీ అయ్యారు. మరికొందరు  కాంగ్రెస్  నేతలను  కూడా డీకే సురేష్  కలిశారు.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  135 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది.  అయితే  కర్ణాటక సీఎం  ఎవరనే విషయమై  కాంగ్రెస్ నాయకత్వం ఇంకా తేల్చలేదు.  ఇవాళ డీకే శివకుమార్, సిద్దరామయ్యతో  చర్చించిన తర్వాత  సీఎం  అభ్యర్ధిని  ఆ పార్టీ నాయకత్వం  ప్రకటించనుంది

ఆదివారంనాడు నిర్వహించిన  కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశంలో  మెజారిటీ ఎమ్మెల్యేలు  సిద్దరామయ్య వైపే మొగ్గు చూపారని సమాచారం.  ఎమ్మెల్యేల  అభిప్రాయాలను  డీకే శివకుమార్, సిద్దరామయ్యల సమక్షంలో  కాంగ్రెస్  పరిశీలకుల బృందం  ప్రకటించే  అవకాశం ఉంది. ఇవాళ న్యూఢిల్లీకి చేరుకన్న తర్వాత  ఎఐసీసీ మాజీ అధ్యక్షురాలు  సోనియాగాంధీతో  డీకే శివకుమార్ భేటీ కానున్నారు. ఆ తర్వాత  రాహుల్ గాంధీతో  కూడా  డీకే శివకుమార్ సమావేశం  అవుతారు. 

also read:కారణమిదీ: డీకే శివకుమార్ ఢీల్లీ టూర్‌ రద్దు

సోమవారంనాడు   డీకే శివకుమార్  మూడు దఫాలు  తన ఢిల్లీ టూర్ ను  వాయిదా వేసుకున్నారు.  చివరికి ఆరోగ్య కారణాలతో  తన ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకున్నట్టుగా  డీకే శివకుమార్ నిన్న రాత్రి  ప్రకటించారు.  నిన్న సాయంత్రం తన గురువను కలిసిన తర్వాత  డీకే శివకుమార్  ఈ ప్రకటన చేశారు.  ఇవాళ ఉదయం  న్యూఢీల్లికి బయలుదేరి వెళ్లారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?