
ఆమెకు పెళ్లై కేవలం నాలుగు రోజులే అవుతుంది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లిన ఆమె నాలుగో రోజే పుట్టింటికి చేరింది. ఏంటా అని ఆరాతీయగా, తన భర్త నపుంశకుడు అని ఆరోపణలు చేసింది. ఏంటా అని విషయం ఆరా తీస్తే.. వరుడు చెప్పిన మాటలకు కుటుంబసభ్యులు షాకయ్యారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా కి చెందిన ఓ యువతికి మే 11వ తేదీన వివాహం జరిగింది. అయితే, అత్తారింటికి వెళ్లిన నాలుగో రోజే ఆమె పెట్టింటికి చేరింది. తన భర్త సంసారానికి పనికిరాడని, అతను మగాడు కాదు అంటూ ఆమె కుటుంబసభ్యులతో చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు షాకయ్యారు. వాళ్ళు వెంటనే అబ్బాయి ఇంటికి చేరుకుని అతడిని, అతని కుటుంబ సభ్యులను నిలదీశారు.
అయితే, అబ్బాయి చెప్పింది విని అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా షాకయ్యారు. అసలు ఆమె తనను పట్టుకోనివ్వలేదని, పీరియడ్స్, తలనొప్పి అంటూ సాకులు చెప్పిందని చెప్పాడు. ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేసిందని, అలాంటప్పుడు తాను నపుంశకుడిని ఎలా అవుతానని అతను వాపోవడం గమనార్హం.
అంతేకాకుండా, ఇంట్లో బంగారం కూడా తీసుకుపోయిందని వరుడి కుటుంబసభ్యులు ఆరోపించడం గమనార్హం. తాము పెట్టిన బంగరామే తెచ్చుకున్నాము అని వధువు కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం. అయితే, ఈ ఘటనపై ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.మరి వారు కలిసే ఉన్నారా లేదా, విడిపోయారా అనే విషయం తెలియరాలేదు.