ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోటాపై క‌ర్నాట‌క స‌ర్కారు షాకింగ్ డిసిష‌న్

By Mahesh Rajamoni  |  First Published Jul 17, 2024, 9:10 PM IST

Karnataka : ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల విష‌యంలో రిజ‌ర్వేష‌న్ల‌పై క‌ర్నాట‌క ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదివ‌ర‌కు రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌రామ‌య్య స‌ర్కారు ప్రత్యేక బిల్లును తీసుకురావడంపై వివిధ ఐటీ వ్యాపార వర్గాల నుంచి వివర్శలు వచ్చాయి. 
 


reservation in private jobs : వివిధ ఐటీ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకతల మ‌ధ్య ప్రైవేట్ రంగంలో స్థానికులకు రిజర్వేషన్ల విష‌యంలో కర్నాటక సర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేటు రంగంలో కూడా క‌న్న‌డిగుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకువ‌చ్చిన‌ బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం దానిని పునఃపరిశీలించనుంది.

ప్రైవేట్ రంగంలో 50 శాతం మేనేజ్‌మెంట్, 75 శాతం నాన్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో కన్నడిగులను నియమించాలని ప్రతిపాదించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు- 2024 ను గురువారం రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించింది. 

Latest Videos

హార్దిక్ పాండ్యా కు గౌతమ్ గంభీర్ షాక్..

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బిల్లును తీసుకురావ‌డంలో మంత్రుల కృషిని కొనియాడుతూ ఈ బిల్లు తీసుకురావ‌డ‌మ స‌రైన నిర్ణ‌యంగా పేర్కొన్నారు. త‌మ ప్రభుత్వం కన్నడ అనుకూల ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పారు. కన్నడిగుల సంక్షేమమే తమ మొద‌టి ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు. అయితే, ప్రైవేటు సంస్థ‌ల్లోనూ రిజ‌ర్వేష‌న్ల‌ బిల్లును తీసుకురావ‌డంపై ఐటీ పరిశ్రమ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. అలాంటి బిల్లు బెంగళూరులో టెక్ పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తుందనీ, ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

సాఫ్ట్‌వేర్ బాడీ నాస్కామ్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై స్పందిస్తూ.. "ఈ బిల్లులోని నిబంధనలపై నాస్కామ్ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బిల్లు నిబంధనలు ఈ పురోగతిని తిప్పికొట్టడానికి, కంపెనీలను తరిమికొట్టడానికి, స్టార్టప్‌లను అణచివేసే ప్రమాదం ఉంది. మరిన్ని ప్రపంచ సంస్థలు (GCCలు) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఈ బిల్లు తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌నుంది" అని పేర్కొంది.

అన్నింటిలోనూ ఛాంపియ‌న్.. కోహ్లీ కంటే రోహిత్ ను క్రికెట‌ర్లు ఎక్కువ‌ ఇష్ట‌ప‌డేది అందుకే.. !


అత్యంత పోటీతత్వంతో కొనసాగుతున్న నేటి ప్రపంచంలో నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించడం విజయానికి కీలకం కాబట్టి ప్రతిభ ఎక్కడ ఉందో విజ్ఞాన ఆధారిత వ్యాపారాలు గుర్తించగలవని తెలిపింది. రాష్ట్రాలు కీలక సాంకేతిక కేంద్రంగా మారాలంటే ద్వంద్వ వ్యూహం కీలకమనీ, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించాలని పేర్కొంది. ఈ బిల్లుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థల సైన్ బోర్డులు, కన్నడ జెండా, కన్నడ భాష, సంస్కృతి, పత్రాలు, కన్నడిగుల గౌరవాన్ని నిలబెట్టేందుకే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కన్నడిగులకు ఉద్యోగాలలో నిర్దిష్ట శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అయితే, ఐటీ పరిశ్రమ నుంచి విమర్శలు రావడంతో తన గొంతును మారుస్తూ.. సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామన్నారు.

Paris Olympics 2024 లో పాల్గొంటున్న భార‌త క్రీడాకారులు వీరే

click me!