ఉక్రెయిన్ తో యుద్దం వేళ...మేడ్ ఇన్ ఇండియా షూస్ తో రష్యా ఆర్మీ  

By Arun Kumar P  |  First Published Jul 16, 2024, 2:11 PM IST

రష్యా, ఉక్రెయిన్ మద్య యుద్దం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా ఆర్మీ మేడ్ ఇన్ ఇండియా షూస్ తో యుద్దంతో పాల్గొంటున్నారు. ఈ షూస్ ప్రత్యేకతలు ఏంటంటే... 


భారతదేశం... అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తూ మన సత్తాను ప్రపంచ దేశాలను తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరింది భారత్. అలాగే ఉత్పాదక రంగం నుండి అంతరిక్షయానం వరకు అన్నిరంగాల్లోనూ సత్తా చాటుతోంది. టాటా, రిలయన్స్ వంటి సంస్థలు మన దేశంలోనే కాదు విదేశాల్లోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాయి. ఇలా ఎందులోనూ భారత్ తక్కువకాదని ప్రపంచానికి అర్థమయ్యింది. 

గతంలో మనం రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులను ఇతర దేశాలను నుండి దిగుమతి చేసుకునేవాళ్లం. ముఖ్యంగా రష్యా నుండే మనకు ఎక్కువగా ఈ సామాగ్రి వచ్చేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు... ఈ పదిపదిహేను ఏళ్లలో భారత్ బాగా అభివృద్ది చెందింది. దీంతో కాలం గిర్రున తిరిగి రష్యా నుండి దిగుమతి చేసుకునే స్థాయినుండి ఆ దేశానికే ఎగుమతులు చేసే స్థాయికి భారత్ చేరుకుంది. 

Russian soldiers will now wear 'Made in Bihar' shoes from Hajipur. pic.twitter.com/YGJXz7ybiQ

— SansadTV (@sansad_tv)

Latest Videos

undefined

 

తాజాగా రష్యా, ఉక్రెయిన్ మద్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్దంలో రష్యా సైనికులు మేడ్ ఇన్ ఇండియా అంటే భారత్ లో తయారుచేసిన షూస్ తో పాల్గొంటున్నారు. ఇలా రష్యన్ ఆర్మీ మన షూస్ వాడుతున్నారంటే వాటి క్వాలిటీ ఏ స్థాయిలో వుందో అర్థమవుతోంది.  

రష్యా ఆర్మీ షూస్ ఎగుమతి ఎక్కడినుండి జరుగుతోందంటే..: 

భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో గతంలో మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఇప్పుడు ఇక్కడే తయారవుతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే దిగుమతి స్థాయి నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది.  

ఇలా బిహార్ లోని హజీపూర్ లో 2018 లో ఓ షూస్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యింది. కొద్ది కాలంలోనే ఈ కంపనీ షూస్ అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఈ షూస్ నాణ్యతకు ఫిదా అయిపోయిన రష్యా తమ ఆర్మీ కోసం వీటిని దిగుమతి చేసుకుంది. ఇలా గత సంవత్సరం 1.5 బిలియన్స్ జతలను రష్యాకు అందించినట్లు సదరు షూ కంపనీ యాజమాన్యం తెలిపింది... ఇలా రష్యాతో రూ.100 కోట్ల బిజినెస్ చేసినట్లు వెల్లడించారు. వచ్చే సంవత్సరం దీన్ని మరో 50 శాతం పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. 

''హజీపూర్ లో నాణ్యమైన షూస్ తయారీ పరిశ్రమను స్థాపించాం. స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూనే ప్రజలకు మంచి షూస్ అందించాలని భావించాం. ప్రస్తుతానికి తమ షూస్ రష్యాకు ఎగుమతి అవుతున్నాయి. త్వరలోనే యూరప్ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నాం. త్వరలోనే డొమెస్టిక్ మార్కెట్ లో తమ కంపనీ షూస్ ను అందుబాటులోకి తెస్తాం'' అని ఈ కంపనీ జనరల్ మేనేజర్ శిబ్ కుమార్ రాయ్ తెలిపారు.

''రష్యా ఆర్మీ తమకు కొన్ని కండిషన్స్ తో షూ ఆర్డర్ ఇచ్చింది. లైట్ వెయిట్ తో మంచి గ్రిప్ ఇచ్చేలా వుండాలన్నారు.  అలాగే తమ దేశ వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా వుండాలన్నారు. వారు సూచించినట్లుగా ప్రత్యేక సోల్ ఉపయోగించి షూస్ రెడీ చేసాం. అవి రష్యా ఆర్మీ అధికారులకు ఎంతగానో నచ్చాయి.దీంతో భారీమొత్తంలో ఈ షూస్ ఎగుమతి చేసినట్లు రాయ్ తెలిపారు. 

ఇక ఈ షూస్ కంపనీ ఎండి దినేష్ ప్రసాద్ మాట్లాడుతూ... బిహార్ లో ప్రపంచ స్థాయి ఫ్యాక్టరీని ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం తమ కంపనీలో అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారని తెలిపారు. కంపనీని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎండి దినేష్ తెలిపారు. 


 

click me!