లాక్‌డౌన్ సడలింపులు: యడ్యూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం

By Siva Kodati  |  First Published May 13, 2020, 8:29 PM IST

లాక్‌డౌన్ సడలింపులపై దేశంలోని అన్ని రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. మే 17తో మూడో దశ లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


లాక్‌డౌన్ సడలింపులపై దేశంలోని అన్ని రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. మే 17తో మూడో దశ లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు మూతపడిన జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు తెరిచేందుకు అనుమతించింది.

బుధవారం రాష్ట్ర పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి సీటీ రవి మాట్లాడుతూ.. జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులను తిరిగి ప్రారంభించే అంశంపై సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పారు.

Latest Videos

undefined

Also Read:సర్వే: మా పిల్లలను స్కూళ్లకు పంపం.. 92 శాతం మంది పేరెంట్స్ మాట

అలాగే పర్యాటక రంగం పూర్వ స్ధితికి చేరుకోవడానికి, భౌతిక దూరం పాటిస్తూ పర్యాటకులను అనుమతించాలని చెప్పినట్లు రవి పేర్కొన్నారు. తన విజ్ఞప్తిపై స్పందించిన సీఎం యడ్యూరప్ప మే 17  తర్వాత నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి చెప్పారు.

మరోవైపు గోల్ఫ్ కోర్సుల  విషయంలో వాటి యజమానులు, గోల్ఫర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే ఆ అంశాన్ని పరిశీలిద్దామని తనతో చెప్పారన్నారు. ‘‘లవ్ యువర్ నేటివ్’’ కాన్సెప్ట్‌తో స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రవి తెలిపారు.

Also Read:చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

ఆ తర్వాత దశల వారీగా అంతర్‌జిల్లా, అంతర్‌రాష్ట్ర, విదేశీ పర్యాటకులను అనుమతిస్తున్నామని మంత్రి చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని బీటీ రవి తెలిపారు. 

click me!