డిస్కంలకు రూ. 90వేల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

By narsimha lode  |  First Published May 13, 2020, 6:06 PM IST

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలకు  90వేల కోట్లను అందిస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కమ్ కు రూ.94 వేల కోట్లు బకాయిలు ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తేనే రూ. 90వేలు కోట్లు చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. 


న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలకు  90వేల కోట్లను అందిస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కమ్ కు రూ.94 వేల కోట్లు బకాయిలు ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తేనే రూ. 90వేలు కోట్లు చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. 

బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. జెన్‌కో, డిస్కమ్ లకు రాయితీలు ఇస్తేనే వినియోగదారుడికి మేలు జరుగుతోందన్నారు. ఆరు మాసాల వరకు కేంద్రం పరిధిలోని సంస్థల్లో కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. రైల్వేలు, రోడ్లు, హైవేల నిర్మాణం, కేంద్ర పబ్లిక్ వర్క్స్ విభాగానికి వర్తించనున్నట్టుగా తెలిపారు.  ప్రభుత్వరంగ సంస్థల కాంట్రాక్టర్లకు పాక్షిక బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని ఆమె కోరారు.

Latest Videos

also read:గుడ్‌న్యూస్: 2019-20 ఐటీ రిటర్న్స్‌కు నవంబర్ వరకు గడువు

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రూ. 30 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నట్టుగా చెప్పారు.ఎన్బీఎప్సీ , హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మ్యూచ్ వలం ఫండ్ల రుణ పత్రాల లావాదేవీలు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్  కంపెనీలకు రెండో విడత క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద రూ. 45 వేల కోట్లు అందిస్తామని ప్రకటించింది. 

రెరా పరిదిలో నిర్మాణ సంస్థలకు ఊరట కల్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకొంది. మరో వైపు మార్చి 25 లోపుగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల కాల పరిమితిని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. రియల్ ఏస్టేట్ డెవలపర్లపై ఒత్తిడి తొలుగుతోందన్నారు.
 

click me!