బళ్లారిలో బీజేపీకి షాక్: కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్ ఇతనే

By narsimha lodeFirst Published Nov 7, 2018, 12:23 PM IST
Highlights

 కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి చావు దెబ్బ తీసింది

బెంగుళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి చావు దెబ్బ తీసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిలో మంత్రి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు.

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా కూడ ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా మంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యూహ రచన సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బళ్లారిలో బీజేపీకి బూత్‌స్థాయిలోనే  ఎక్కువ ఓట్లు వచ్చేలా శివకుమార్ చేసిన ప్లాన్ కాంగ్రెస్  అభ్యర్థికి కలిసివచ్చింది. 2004 నుండి బళ్లారిలో బీజేపీకి తిరుగులేని కంచుకోటగా నిలిచింది. అలాంటి బళ్లారిలో బీజేపీ కంచుకోటను బద్దలు కొడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా గుజరాత్ రాష్ట్రంలో రాజ్యసభ  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు గాను బెంగుళూరు రిసార్ట్స్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కంటికి రెప్పలా కాపాడారు.  ఆ సమయంలో బీజేపీ నుండి బేరసారాలు సాగినా కూడ శివకుమార్ దిగి రాలేదని కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతారు. 

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుజరాత్ రాష్ట్రం నుండి రాజ్యసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత మీడియాకు చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు డికె శివకుమార్ పై ఐటీ దాడులు జరిగాయి. కానీ, తనను ఏమీ చేయలేదని శివకుమార్ బహిరంగంగానే బీజేపీకి సవాల్ విసిరారు.

బళ్లారిలో కాంగ్రెస్ కు అద్భుత విజయాన్ని అందించడంతో పాటు రామ్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ శివకుమార్  చక్రం తిప్పారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏకంగా బీజేపీ అభ్యర్థినే బరిలో నుంచి తప్పుకొనేలా చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్- జెడీఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేలా డీకే శివకుమమార్ వ్యూహత్మకంగా వ్యవహరించారు. ఈ  రెండు పార్టీల ఎమ్మెల్యేలను హైద్రాబాద్ కు తీసుకురావడంలోనూ... ఆ తర్వాత వారిని బెంగుళూరు నుండి అసెంబ్లీకి చేర్చడంలో శివకుమార్ బీజేపీకి అంతు చిక్కని వ్యూహంతో వేసిన అడుగులు కుమారస్వామి సీఎం కావడానికి దోహదపడ్డాయి.

సంబంధిత వార్తలు

బిజెపి ఓటమికి కారణాలివే: యడ్యూరప్ప

కాంగ్రెస్ 14 ఏళ్ల నిరీక్షణ... ‘‘గాలి’’ కోటలో హస్తం పాగా


 

click me!