కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే లాక్ డౌన్ అయితే నాకేంటి అన్నట్టుగా తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు. నెత్తిన తలపాగా ధరించి చేతికి గ్లవుజులు వేసుకొని, భారీ చాక్లెట్ కేక్ కోసి అందరికి పంచాడు. తుముకూరు జిల్లా తురువెకేరే ఎమ్మెల్యే జయరాం, గుబ్బి పట్టణంలో ఈ బర్త్ డే వేడుకలను నిర్వహించాడు.
ప్రజలు లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తే తీవ్రంగా విరుచుకుపడే పోలీసులు రాజకీయ నాయకులను మాత్రం ఎందుకు విడిచిపెడుతున్నారో అనేది అర్థం కానీ విషయం. బహుశా ఈ లాక్ డౌన్ రాజకీయ నాయకులకు వర్తించదేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ఆక్రోశాన్ని సెటైర్ల రూపంలో వెళ్లగక్కుతున్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే లాక్ డౌన్ అయితే నాకేంటి అన్నట్టుగా తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు. నెత్తిన తలపాగా ధరించి చేతికి గ్లవుజులు వేసుకొని, భారీ చాక్లెట్ కేక్ కోసి అందరికి పంచాడు. తుముకూరు జిల్లా తురువెకేరే ఎమ్మెల్యే జయరాం, గుబ్బి పట్టణంలో ఈ బర్త్ డే వేడుకలను నిర్వహించాడు.
ఫొటోగ్రఫేర్లు, విడియోగ్రాఫర్ల సందడితో అధికంగా వచ్చిన జనాలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కరోనా మహమ్మారి అనే భయం లేకుండా అక్కడకు వచ్చిన వారందరికీ సదరు ఎమ్మెల్యే గారు బిర్యానీ వండించి పెట్టించారు.
ప్రజలేదో బిర్యానీ కోసమో, మరల నాయకుడితో పనిబడితే ఎలా అనుకున్న అనుచర వర్గమో వచ్చారు అనుకుందాం, సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నేతలు ఇలా ప్రవర్తించడం మాత్రం చాలా బాధాకరం.
కర్ణాటకలో లాక్ డౌన్ వేళా ఇలాంటివి చాలానే జరిగాయి. కొన్ని రోజుల కింద ముఖ్యమంత్రి యెడియూరప్ప బెళగావిలోని ఒక పెళ్ళికి వెళ్లి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు అది వైరల్ గా మరి సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడ్డ విషయం అందరికి తెలిసిందే.
భారత దేశంలో ఈ వైరస్ ఇంకా పంజా విసురుతూనే ఉందేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. 24 గంటల్లో కొత్తగా 678 కొత్త కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఇప్పటివరకు ఈ వ్యాధితో 199 మంది మృతి చెందారన్నారు.
శుక్రవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఒక్క రోజునే 16,002 మందిని పరీక్షిస్తే 0.2 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. దేశంలో ఉన్న 20,473 మంది విదేశీయులను వారి దేశాలకు పంపామన్నారు.
Also read:కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట
హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ మందు కావాలని చాలా దేశాలు భారత్ ను కోరుతున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు.
మన దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరిపడు నిల్వలు ఉన్నాయన్నారు. 38 వేల క్యాంపుల్లో 14.3 లక్షల మందికి షెల్టర్ ఇచ్చామన్నారు.రూ. 15 వేల కోట్లతో ప్రత్యేక కోవిడ్ ప్యాకేజీని రూపొందించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం నాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.ది.