దొంగతనానికి వచ్చి.. నిద్రిస్తున్న మహిళపై అఘాయిత్యం

Published : Apr 11, 2020, 07:33 AM IST
దొంగతనానికి వచ్చి.. నిద్రిస్తున్న మహిళపై అఘాయిత్యం

సారాంశం

దొంగతనానికి వెళ్లగా.. మహిళ ఒంటరిగా కనపడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న అన్నాగనర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. 

ఓ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ.. ఆ ఇంట్లో నిద్రపోతున్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. దొంగను సీసీ కెమేరాల సహాయంతో గుర్తించారు. అయితే.. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది.  పోలీసులు గట్టి బందో బస్తు నిర్వహించారు. ఇలాంటి సమయంలోనూ దొంగ చోరీకి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read రోడ్డుపై రెండు రూ.500 నోట్లు: ముట్టుకోని జనం.. రంగంలోకి పోలీసులు...

పూర్తి వివరాల్లోకి వెళితే...అన్నాగనర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి వెనుక వైపు నుంచి ఓ యువకుడు గురువారం సాయంత్రం ప్రవేశిస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. కేకలు పెట్టడంతో అతడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. అక్కడ దొంగతనం చేయాలన్న అతని ప్లాన్ 
బెడిసి కొట్టడంతో  తిరుమంగళం వైపు ఓ నాలుగు అంతస్తుల భవనంలోకి ఆ యువకుడు ప్రవేశించాడు. 

అక్కడ పై అంతస్తు డాబాలోకి ప్రవేశించాడు. దొంగతనానికి వెళ్లగా.. మహిళ ఒంటరిగా కనపడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న అన్నాగనర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు ఆ యువకుడు అమింజికరైకు చెందిన వేల్‌మురుగన్‌ కుమారుడు రామకృష్ణన్‌గా తేలింది.

 చోరీ కేసులో అరెస్టయిన, ఇతగాడు లాక్‌డౌన్‌ పుణ్యమా బయటకు వచ్చాడు. జైలు నుంచి రాగానే, దొంగతనానికి ప్రయత్నించి, చివరకు ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?