బీహార్ లో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 40 శాతం కేసులు ఒకే కుటుంబం నుంచి నమోదయ్యాయి అంటే నమ్ముతారా...? కానీ అది నిజం. బీహార్ లో కరోనా హాట్ స్పాట్ గా ఉన్న సివాన్ జిల్లాలో ఒకే కుటుంబం నుంచి 23 మంది కరోనా పాజిటివ్ గా తేలారు
కరోనా మహమ్మారి భారతదేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ లాక్ డౌన్ ని విధించిన విషయం తెలిసిందే. ఇలా లాక్ డౌన్ విధించడం వల్ల ఒకరకంగా భారతదేశం ఈ మహమ్మారిని చాలా వరకు అరికట్టగలిగింది.
ఇకపోతే బీహార్ లో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 40 శాతం కేసులు ఒకే కుటుంబం నుంచి నమోదయ్యాయి అంటే నమ్ముతారా...? కానీ అది నిజం. బీహార్ లో కరోనా హాట్ స్పాట్ గా ఉన్న సివాన్ జిల్లాలో ఒకే కుటుంబం నుంచి 23 మంది కరోనా పాజిటివ్ గా తేలారు.
గత నెలలో ఒమన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తివల్ల ఆ కుటుంబంలోని వారికి ఈ కరోనా వైరస్ సోకినట్టు అధికారులు తెలుపుతున్నారు. గత నెలలో 16వ తేదీ నాడు ఒక వ్యక్తి ఒమాన్ నుంచిఓ సివాన్ జిల్లాలోని తన సొంత ఊరికి వచ్చాడు. అతడు కరోనా పాజిటివ్ గా తేలింది ఏప్రిల్ 4వ తేదీ నాడు.
అతడు విదేశాల నుంచి రావడం వల్ల అందరిని కలవడానికి వెళ్ళాడు. చుట్టుపక్కల ఇండ్ల నుంచి వేరే గ్రామాల వరకు చాలా చోట్లకు ప్రయాణించదు. ఈ వ్యక్తి దెబ్బకు అధికారులు దాదాపుగా 43 గ్రామాలను సీల్ చేసి పడేసారు. కుటుంబంలోని 22 మందికి ఈ వైరస్ సోకింది. అతడితోన్ కలుపుకుంటే ఒకే కుటుంబంలో 23 మందన్నమాట.
ఇకపోతే దేశంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. 24 గంటల్లో కొత్తగా 678 కొత్త కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఇప్పటివరకు ఈ వ్యాధితో 199 మంది మృతి చెందారన్నారు.
శుక్రవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఒక్క రోజునే 16,002 మందిని పరీక్షిస్తే 0.2 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. దేశంలో ఉన్న 20,473 మంది విదేశీయులను వారి దేశాలకు పంపామన్నారు.
Also read:కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట
హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ మందు కావాలని చాలా దేశాలు భారత్ ను కోరుతున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు.
మన దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరిపడు నిల్వలు ఉన్నాయన్నారు. 38 వేల క్యాంపుల్లో 14.3 లక్షల మందికి షెల్టర్ ఇచ్చామన్నారు.రూ. 15 వేల కోట్లతో ప్రత్యేక కోవిడ్ ప్యాకేజీని రూపొందించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం నాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.