ఏప్రిల్ 12లోపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీని ఎవరూ ఆపలేరు - మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప

By Asianet NewsFirst Published Feb 4, 2023, 4:43 PM IST
Highlights

కర్ణాటకలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 130-140 సీట్లు సాధిస్తామని ఆయన అన్నారు. 

ఏప్రిల్ 10-12లోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో సాధించిన విజయాల ఆధారంగా కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో ఎలాంటి గందరగోళం లేదని, అందరూ ఐక్యంగా ఉన్నారని అన్నారు.  మహిళలు, యువత, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మద్దతును పొందడంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలు, నాయకులను కోరారు. పార్టీ ప్రత్యేక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

డబ్బు, కండబలం, మతతత్వ రాజకీయాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజులు పోయాయని ఆయన అన్నారు. ఏప్రిల్ 10,12 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 130-140 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా బీజేపీని ఎవరూ ఆపలేరని యడ్యూరప్ప అన్నారు.

బీహార్ లో విచిత్రం.. ఆధార్ కార్డ్ అటాచ్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కుక్క.. వైరల్

కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు తదుపరి ముఖ్యమంత్రులమని చెప్పుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ మీ నాయకుడా అని తాను కాంగ్రెస్ నేతలను అడగాలనుకుంటున్నానని యడియూరప్ప అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడు తమకు (బీజేపీ) ఉన్నారని, ఆయనను ప్రపంచం మొత్తం ప్రేమిస్తోందని, గౌరవిస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంతో కర్ణాటకతో పాటు రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పడంలో సందేహం లేదని అన్నారు. 

ఈ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు చేరని సభ ఒక్కటి కూడా ఉండదని, ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్ లో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు, పథకాలు వస్తాయని ఆశిస్తున్నామని యడ్యూరప్ప పార్టీ పదాధికారులను ఉద్దేశించి అన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరనే ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులపై దృష్టి సారించాలని, సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, తమ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. 

From the IAF Vault: భారత వైమానిక దళానికి మొదటి చీఫ్‌ను ఎలా ఎంపిక చేశారో తెలుసా? తెరవెనుక ఆసక్తికర పరిణామాలు

కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలు చేస్తున్నారని యడియూరప్ప అన్నారు. అసమ్మతి, అసంతృప్తులతో కాంగ్రెస్ నిండిపోయిదని తెలిపారు. విభేదాల మధ్య మరో సీనియర్ కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర అసంతృప్తి వ్యక్తం చేశారని, అయితే బీజేపీలో ఎలాంటి గందరగోళాలు లేవని, అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ లు హాజరయ్యారు. 

అనంతరం సభను ఉద్దేశించి అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. తాను రాష్ట్రమంతా పర్యటించానని, ప్రజలను కలిశానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించానని, కర్ణాటకలో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకం కలిగిందని అన్నారు. బీజేపీ 150 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకుంటుందని, తమకు బలమైన క్యాడర్ బేస్ ఉందని తెలిపారు. 

click me!