బీహార్ లో విచిత్రం.. ఆధార్ కార్డ్ అటాచ్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కుక్క.. వైరల్

By Asianet NewsFirst Published Feb 4, 2023, 4:00 PM IST
Highlights

బీహార్ లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుక్క తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ అందజేయాలని దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓ కుక్క తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంది. ఫ్రూఫ్ గా తన ఆధార్ కార్డును కూడా జత చేసింది. ఈ అప్లికేషన్ ను చూసి అధికారులు ఖంగుతిన్నారు. బీహార్ లో వెలుగులోకి వచ్చిన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

From the IAF Vault: భారత వైమానిక దళానికి మొదటి చీఫ్‌ను ఎలా ఎంపిక చేశారో తెలుసా? తెరవెనుక ఆసక్తికర పరిణామాలు

వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం గయా జిల్లాలోని గుర్రూరు మండల అధికారులకు జనవరి 24వ తేదీన ఆన్ లైన్ లో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఒక దరఖాస్తు వచ్చింది. దానిని ఓపెన్ చేసి పరిశీలించిన అధికారులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది మనిషి కాదు. కుక్క. 

బీజేపీ ప్రభుత్వం అందరితో పోరాడుతోంది.. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుంటేనే మంచిది -కేజ్రీవాల్

అందులో ఆ కుక్క తన పేరు ‘టామీ’ అని పేర్కొంది. తన తండ్రి పేరు షేరు అని, తల్లి పేరు గిన్ని అని తెలిపింది. ఈ దరఖాస్తుకు ఆ కుక్క ఆధార్ కార్డును కూడా జత చేయడం గమనార్హం. ఆధార్ కార్డ్‌లో టామీ పుట్టిన తన తేదీ ఏప్రిల్ 14,2022 అని పేర్కొంది. చిరునామా గ్రామం పందేపోఖర్, పంచాయతీ రౌనా, వార్డు నంబర్ 13, సర్కిల్ గురారు, పోలీస్ స్టేషన్ కొంచ్ అని పేర్కొంది.

తల్లిదండ్రులు కాబోతున్న కేరళ ట్రాన్స్ జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారి..

ఆ ఆధార్ కార్డుపై కూడా ‘‘ఆధార్ - ఆమ్ కుట్టా కా అధికార్’’ అని రాసి ఉంది. టామీ ఆధార్ కార్డుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విచిత్ర ఘటనపై గురారు బ్లాక్ సర్కిల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ త్రివేది మాట్లాడుతూ.. దరఖాస్తుపై పేర్కొన్న ఫోన్ నంబర్ ట్రూకాలర్‌లో రాంబాబు అని చూపుతోందని అన్నారు. కాగా.. ఈ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. అయితే ఈ తుంటరి పని వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!