శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

Published : Sep 28, 2018, 02:49 PM IST
శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సారాంశం

శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.అయితే  ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న మహిళ న్యాయమూర్తి మాత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించారు.

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.అయితే  ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న మహిళ న్యాయమూర్తి మాత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించారు.దీంతో 4-1తేడాతో ఈ తీర్పు వెలువడింది.

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో  జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉన్నారు.  ఇందూ మల్హోత్రా మాత్రం  ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మాత్రం వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

 ట్రిపుల్‌ తలాక్‌ కేసుకు, శబరిమల కేసుకు మధ్య ఉన్న తేడాను చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377  కేసుల్లో నిజమైన బాధితులతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్‌ దాఖలు చేయడంతో అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కానీ శబరమల ఆలయం ప్రవేశం నిషేధంపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కూడ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు.  

 కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని చెప్పారు. వీరిలో ఎక్కువమంది శబరిమల ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. 

భారతదేశం వేర్వేరు మతపరమైన ఆచారాలను కలిగి ఉందన్నారు. రాజ్యాంగం కేవలం ఎవరైనా ఒక మతాన్ని గౌరవించటానికి ,పాటించటానికి అనుమతిస్తుందన్నారు.. అతను లేదా ఆమె నమ్మే ఆచరించే  మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాదన్నారు.

సంబంధిత వార్తలు

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

శబరిమలలోకి మహిళలు.. హిందూ సంఘాల ఆందోళన

‘‘మహిళలను చూడటం అయ్యప్పకు ఇష్టముండదు’’
ఇప్పుడు ఆ పార్వతి శబరిమల ఆలయంలోకి వెళ్లొచ్చు

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే