జూలై 4న షిండే ప్ర‌భుత్వానికి విశ్వాస పరీక్ష.. 3వ తేదీన స్పీకర్ ఎన్నిక

By Sumanth KanukulaFirst Published Jul 1, 2022, 2:45 PM IST
Highlights

కొత్తగా ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. దాని కంటే ఒక రోజు ముందు శాసన సభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు.

మహారాష్ట్రలో సంకీర్ణ ఎంవీఏ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయింది. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యింది. గురువారం సాయంత్రం శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నాయ‌కుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే ఈ కొత్త ప్ర‌భుత్వం స‌భ‌లో త‌న బ‌లాన్నినిరూపించుకోవాల్సి ఉంది. ఆ త‌రువాతే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. అయితే మొద‌ట జూలై 2 తేదీన ఈ సమావేశాల నిర్వ‌హించాల‌ని భావించినా.. ఇప్పుడు దానిని వాయిదా వేశారు. 

అబార్షన్ పిల్ వేసుకున్న ప్రెగ్నెంట్ మైనర్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్టు

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఒక రోజు తేడాతో నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇంత‌కు ముందు జులై 2, 3 తేదీల్లో సమావేశాలు జరగాల్సి ఉంది. కాగా ఇప్పుడు జూలై 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆదివారం (జూన్ 3) విధానసభ ప్రత్యేక సమావేశంలో స్పీకర్ పదవికి ఎన్నిక చేప‌ట్ట‌నున్నారు. కొత్త స్పీక‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

‘‘ప్రేమ‌ లేఖ‌లు వ‌చ్చాయి’’ - ఆదాయ‌పు పన్ను శాఖ ప‌న్ను నోటీసుపై శ‌ర‌ద్ ప‌వార్ సెటైర్

మహావికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో నానా పటోలే అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి మహారాష్ట్ర శాసనసభకు స్పీకర్‌ లేరు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా నరహరి జిర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు షిండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక సెషన్‌లో స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. బీజేపీ నుంచి స్పీకర్ పదవి రేసులో రాధాకృష్ణ విఖే పాటిల్ పేరు ఉంది. కాగా షిండే వర్గం తరపున అధికార ప్రతినిధి దీపక్ కేసర్కర్ పేరు కూడా చర్చలో ఉంది. మరి ఎవరి పేరు ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

భారత్ కుప్పకూలిపోయే ముప్పు ఉన్నది.. ఐక్యంగా ఉండాలి: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్

రాధాకృష్ణ విఖే పాటిల్ 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే 2019 ఎన్నిక‌ల త‌రువాత రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా మారిపోయాయి. శివ‌సేన‌, బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న‌కుంటే శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ కూట‌మిగా ఏర్పడి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లను వీడి బీజేపీలో చేరిన పలువురు నేతల కలలు కల్లలయ్యాయి. వీరిలో విఖే పాటిల్ కూడా ఒకరు. ఇప్పుడు మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాటిల్‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

click me!