నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష...

Published : Jul 01, 2022, 02:09 PM IST
నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష...

సారాంశం

త్రిపురలో ఓ కామాంధుడికి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. ఇంటిముందు ఆడుకుంటున్న నాలుగున్నరేళ్ల చిన్నారిని తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. 

అగర్తల : నాలుగున్నరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హత్య చేశాడు. ఈ వ్యక్తిని ఆ తర్వాత అరెస్టు చేశారు. త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు. ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే… అగర్తలలోని  ఖోవై జిల్లాలో తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్లు బాలిక నిరుడు ఫిబ్రవరిలో ఇంటిముందు ఆడుకుంటుంది.   కాసేపటికి బాలిక కనిపించకుండా పోయింది. ఆరు రోజుల తర్వాత  ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.

బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కాళీ చరణ్ త్రిపురను  అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్ బిద్యేశ్వర్ సిన్హా తాజాగా నివేదికను, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించారు. విచారణ తర్వాత నిందితుడు దోషిగా నిర్ధారించిన కోర్టు మరణ శిక్ష విధించింది. ఖోవై జిల్లాలో మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. 

డ్రైవ‌ర్ తో క‌లిసి త‌ల్లిని, అక్కను హ‌త్య చేసిన మైన‌ర్.. త‌రువాత వారిద్ద‌రు కూడా.. ముంబై లో ఘ‌ట‌న

కాగా, జూన్ 6న ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. వివరాల్లోకి వెడితే... ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో బుధవారం 13 ఏళ్ల దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురై, తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న బాలిక బుధవారం రాత్రి తన కుటుంబంతో కలిసి తన ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో సామూహిక అత్యాచారానికి గురైందని పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శర్మ పిటిఐకి తెలిపారు.

అత్యాచార బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు ఆమె పోస్ట్ మార్టం నివేదిక ధృవీకరించింది. శవపరీక్ష రిపోర్ట్ శనివారం ఆలస్యంగా అందిందని, బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించామని పోలీసులు ఆదివారంతెలిపారు. ఆరుబయట నిద్రిస్తున్న బాలిక బుధవారం రాత్రి కనిపించకుండా పోయి.. గురువారం రెండు చేతులు కట్టివేయబడిన స్థితిలో దొరికింది. ఈ ఘటనలో నదీమ్, ఆదర్శ్ పాండే, విపుల్ మిశ్రా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు శర్మ తెలిపారు.

మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం : పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో చిత్రకూట్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం, బాధితురాలు తన ఇంటి బయట నిద్రిస్తుండగా, ఒక యువకుడు, కూలీ వారి ఇంట్లోకి ప్రవేశించి బాలికను అపహరించారు. ఆ తరువాత నిందితులు బాధితురాలిని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు ఇంటి బయట కనిపించకపోవడంతో ఆమె కోసం వెతకడం ప్రారంభించామని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పొలంలో పడి ఉన్న ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కౌశాంబిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన బాలిక గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నివేదికలోని వివరాలను పహాడీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అజిత్ పాండే ధృవీకరించారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu