ఎన్నికైన ప్రభుత్వాల గొంతులను అణచివేసే ప్రయత్నం - సిసోడియా అరెస్టుపై జార్ఖండ్ సీఎం సోరెన్ వ్యాఖ్యలు

Published : Feb 28, 2023, 03:43 PM IST
ఎన్నికైన ప్రభుత్వాల గొంతులను అణచివేసే ప్రయత్నం - సిసోడియా అరెస్టుపై జార్ఖండ్ సీఎం సోరెన్ వ్యాఖ్యలు

సారాంశం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టుపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ చర్య ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల గొంతులపై దాడి చేసి. అణచివేసే ప్రయత్నం అని తీవ్రంగా ఆరోపించారు. 

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు నిరాశాజనకమని, నిరుత్సాహపరిచిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల గొంతులపై దాడి చేసి. అణచివేసే ప్రయత్నమని ఆరోపించారు. ‘‘ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు నిరాశాజనకంగానూ, నిరుత్సాహంగానూ ఉంది. ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యల కోసం కృషి చేస్తున్న, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల గొంతులపై దాడి చేసి అణచివేసే మరో సిగ్గుమాలిన ప్రయత్నం ఇది’’ అని సోరెన్ ట్వీట్ చేశారు.

మ‌నీష్ సిసోడియాపై గౌత‌మ్ గంభీర్ ఫైర్.. ఆప్ పై విమ‌ర్శ‌ల దాడి

జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం అనంతరం సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏం జరుగుతోందో యావత్ దేశం గమనిస్తున్నందున ఈ అంశంపై పెద్దగా చెప్పడానికి ఏమీ లేదని అన్నారు. కానీ, జరుగుతున్నది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కచ్చితంగా చెబుతానని సోరెన్ అన్నారు.

1000 కోట్ల అక్రమ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి 2022 నవంబర్ 17న సోరెన ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అప్పటి నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన పదేపదే ఆరోపిస్తున్నారు.

ఉల్లిగడ్డల దండలతో అసెంబ్లీకి ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. టోకు ధరల కోసం నిరసనలు

ఇదిలావుండగా.. బ్యాంకులు నిరంతరం నష్టాల్లో నడుస్తున్నాయని, కాబట్టి కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఇంట్లోనే దాచిపెట్టాలని సోరెన్ గిరిజనులకు సూచించడం మరోసారి వివాదానికి దారితీసింది. ఫిబ్రవరి 22న రామ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో సోరెన్ ఈ విషయాన్ని చెప్పినప్పటికీ అది ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం మోడీ ప్రభుత్వంలో జరిగిందనిహేమంత్ సోరెన్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిందని తెలిపారు. ఏ బ్యాంకు దివాలా తీస్తుందో ఎవరికీ తెలియదని అన్నారు. ‘‘పేద రైతులు, కూలీలు తమ డబ్బును భూమి కింద పూడ్చిపెట్టాలని నేను చెబుతున్నాను. కానీ వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొద్దు. ప్రస్తుత పరిస్థితిలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎప్పుడు మాయమవుతాయో మీకు తెలియదు’’ అని ఆయన అన్నారు.

అప్పుడే పుట్టిన పసికందుని పాము కాపాడింది..!

మన పూర్వీకులు తమ డబ్బును బియ్యం బస్తాల లోపల, పెట్టెల్లోని బట్టల కింద దాచుకునేవారని సోరెన్ అన్నారు. కనీసం వారు అక్కడ దాచుకున్నది వారికి లభించిందని, కానీ మీరు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మీకు ఏమీ లభించదు అని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం