జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. తన భార్య పాయల్ అబ్దుల్లా నుంచి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కానీ, ఆ కోర్టు విడాకులు మంజూరు చేయలేదు. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం కూడా ఆయన పిటిషన్ తిరస్కరించింది.
న్యూఢిల్లీ: భార్యతో విడాకులు తీసుకోవడానికి ఓ మాజీ సీఎం కోర్టు మెట్లు ఎక్కాడు. కానీ, ఆ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కాదు, కూడదు అని కోర్టు చెప్పింది. దీంతో ఆయన హైకోర్టులోనూ పిటిషన వేశాడు. ఆ కోర్టు కూడా సదరు నేతకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. ఆయన విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసు ఎవరిదో కాదు.. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాది.
ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఆమెతో తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఆమె తనపై క్రూరత్వం ప్రదర్శిస్తున్నదని ఆరోపించాడు. అయితే, ఫ్యామిలీ కోర్టు ఆయన ఆరోపణలను ధ్రువీకరించలేదు. ఆయన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, హేతుబద్ధంగా లేవని పేర్కొంది. క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలూ ఆయన సమర్పించలేకపోయాడని వివరించంది. ఇలా పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను 2016లో తోసిపుచ్చింది.
Also Read: TSPSC: టీఎస్‌పీఎస్‌సీలో ఏం జరుగుతోంది? మరో అధికారి రాజీనామా.. ‘నేను ఎంతో క్షోభకు గురయ్యా’..
దీంతో ఒమర్ అబ్దుల్లా.. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా ఈ విడాకుల పిటిషన్ పై విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ వికాస్ మహాజన్‌ల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి.. ఈ కేసులో మెరిట్ లేదని పేర్కొంది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. ఒమర్ అబ్దుల్లా పిటిషన్‌ను తిరస్కరించింది.