రాజస్తాన్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను ఎంపిక చేసి బీజేపీ అందరికీ షాక్ ఇచ్చింది. ఆయన గురించి టాప్ 5 పాయింట్లు చూద్దాం.
రాజస్తాన్ సీఎంపై సస్పెన్స్‌కు తెరపడింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మను రాజస్తాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. సీఎం సీటు కోసం కేంద్రమంత్రులు, వసుంధర రాజే వంటి పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పోటీ పడ్డారు. కానీ, బీజేపీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. భజన్ లాల్ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడు. ఆయన గురించి ఐదు టాప్ పాయింట్లు చూద్దాం.
1. భజన్‌లాల్ శర్మ భరత్‌పుర్‌కు చెందిన నేత. కానీ, ఆయన భరత్‌పుర్‌లో గెలిచే అవకాశాలు తక్కువగా కనిపించాయి. అందుకే బీజేపీ ఆయనకు సంగనార్ నుంచి బరిలో దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్రను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా భజన్‌లాల్ శర్మ గెలిచారు.
2. ఈయన సంస్థాగతంగా చురుకైన వ్యక్తి. రాజస్తాన్ బీజేపీకి దీర్ఘకాలం జనరల్ సెక్రెటరీగా చేశారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించే వరకు ఈయనే జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు.
3. భజన్‌లాల్ శర్మ తన రాజకీయ ప్రస్థానంలో తొలినాళ్లలో ఏబీవీపీలో చేరారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ అని తెలిసిందే.
Also Read: Rajasthan CM: రాజస్తాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ.. బీజేపీ సంచలన నిర్ణయం
4. రాజస్తాన్‌లో బీజేపీకి సంబంధించి ఏ కర్తవ్యాన్నైనా నిస్సంకోచంగా చేయడానికి ముందుకు వెళ్లే వ్యక్తిగా భజన్‌లాల్ శర్మకు పేరుంది. ఈయన అగ్రవర్ణానికి చెందిన నేత అయినా.. లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు.
5. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ పీజీ చేశారు. ఆయనకు 43.6 లక్షల చరాస్తులు, రూ. 1 కోటి స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా సుమారు రూ. 1.5 కోట్ల ఆస్తి ఉన్నట్టు తన అఫిడవిట్‌లో భజన్‌లాల్ శర్మ తెలిపారు.