జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే టాప్ కమాండర్ టెర్రరిస్టు హతం

By telugu team  |  First Published Oct 13, 2021, 4:43 PM IST

జమ్ము కశ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ షామ్ సోఫి హతమయ్యాడు. ఈ విషయాన్ని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్ వెల్లడించారు. 
 


శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో నిత్యం encounterలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మరణిస్తూనే ఉన్నారు. జమ్ము కశ్మీర్‌లో కొంత కాలంగా ఉగ్రబెడద సద్దుమణిగినట్టే అనిపించినా మళ్లీ పెరుగుతున్నది. కొన్నాళ్లుగా కాల్పులు, ఎదురుకాల్పులతో కశ్మీర్ లోయ దద్దరిల్లుతున్నది. తాజాగా బుధవారం దక్షిణ కశ్మీర్ జిల్లా pulwamaలో అవంతిపొరాలోని త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు, టాప్ terrorist షామ్ సోఫి హతమయ్యాడు. ఈ విషయాన్ని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్ వెల్లడించారు.

త్రాల్ ఏరియాలోని తిల్వాని మొహల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం అందగానే భద్రతా బలగాలు ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే jammu kashmirలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అక్కడ తలదాచుకున్న ఉగ్రవాది పోలీసులపైకి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులూ ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే టెర్రరిస్ట్ సోఫి హతమయ్యాడు.

Latest Videos

హతమైన ఉగ్రవాది jaishe mohammad top commander టెర్రరిస్టు అని విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.

Also Read: జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ముగ్గురు తీవ్రవాదులు హతం..

జమ్ము కశ్మీర్‌లోని poonch సెక్టార్‌లో సోమవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు మరణించారు. పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ ఏరియా నుంచి బయటికి వెళ్లే దారులు మూసేసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తెల్లవారుజామునే మొదలుపెట్టారు. 

భద్రతా వలయం ఉచ్చులో ఉగ్రవాదులు చిక్కారు. కార్డన్ సెర్చ్ చేస్తున్న జవాన్లు సమీపిస్తుండటంతో ఆయుధాలతో వారిపై firingకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలోనే వారు వీరమరణం పొందారు. ఇందులో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నట్టు army అధికారిక ప్రకటన వెల్లడించింది. అలాగే, ఇరువైపుల encounter ఇంకా కొనసాగుతున్నదని వివరించింది.

ఈ ఘటన తర్వాత జమ్ము కశ్మీర్‌లో భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం జల్లెడ పట్టారు. అనంతరం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.

click me!