ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరుగుతున్నది. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఆర్యన్ ఖాన్ టచ్‌లో ఉన్నాడని, అర్బాజ్ మెర్చంట్ ద్వారా ఆయన డ్రగ్స్ సేకరించేవాడని ఎన్‌సీబీ అనుమానించింది. ఆయనకు బెయిల్ ఇవ్వరాదని తెలిపింది. కాగా, ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ లభించలేవని, మాదక ద్రవ్యాలను కొనుగోలు చేయడానికీ ఆయన దగ్గర డబ్బుల్లేవని ఆయన తరఫున న్యాయవాది అమిత్ దేశాయ్ వాదించారు.
ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ Shah Rukh Khan తనయుడు Aryan Khanపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఆర్యన్ ఖాన్ టచ్‌లో ఉన్నాడని తెలిపింది. అక్రమంగా మాదక ద్రవ్యాలు వీరి నుంచి సేకరించడానికి వీరితో టచ్‌లోకి వెళ్లాడని పేర్కొంది. ఇప్పుడు ఆ నెట్‌వర్క్‌నూ కనుగొన్నట్టు వివరించింది. ఈ నెట్‌వర్క్ కోసం దర్యాప్తు ఇంకా జరపాల్సి ఉన్నదని పేర్కొంది. అర్బాజ్ మెర్చంట్ ద్వారా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నదని వివరించింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ అంతర్భాగంగా ఉన్నాడని తెలిపింది. ఆయనకు బెయిల్ ఇవ్వడం సరికాదని NCB అభిప్రాయపడింది.
ఈ నెల 3న ముంబయి నుంచి గోవాకు బయల్దేరిన ఓ క్రూజ్ షిప్‌లో NCB అధికారులు raids చేసిన సంగతి తెలిసిందే. తనిఖీల్లో drugs తీసుకుంటున్నట్టు అనుమానించిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. విచారణ కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ bail కోసం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లగా, ఆ విషయం తమ పరిధిలో లేదని తెలిపింది. అనంతరం NDPS కోర్టులో బెయిల్ దరఖాస్తుపై విచారణ జరుగుతున్నది.
undefined
ఆర్యన్ ఖాన్ ప్రభావవంతమైన కుటుంబానికి చెందినవాడు కాబట్టి, ఆయనకు బెయిల్ ఇస్తే ఆధారాలు, ఆయనకు తెలిసిన ఇతర నిందితులకూ కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నించవచ్చునని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది. తమ ప్రాథమిక విచారణలో అక్రమ మాదక ద్రవ్యాల కొనుగోలు, పంపిణీలో ఆర్యన్ ఖాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు తేలిందని వివరించింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌ది ప్రత్యేక కేసు అని విడగొట్టలేమని, మాదక ద్రవ్యాల ముప్పుకు సంబంధించి అందరినీ కలిసే విచారించాలని పేర్కొంది.
Also Read: Aryan Khan : ఆర్యన్ ఖాన్ కు మూడోసారి బెయిల్ నిరాకరించిన కోర్టు..
ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆర్యన్ ఖాన్ దగ్గర అసలు డ్రగ్స్ లభించనేలేదని, అయినా ఆయనను కస్టడీలోకి తీసుకుని బెయిల్ ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఎంత దొరికింది? దొరికిందా? లేదా? అనేది అసమంజసమని, ఆయనను విడుదల చేస్తే కేసు దర్యాప్తును అడ్డగించవచ్చునని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.
డ్రగ్స్ కొనుక్కోవడానికి ఆర్యన్ ఖాన్ దగ్గర డబ్బులే లేవని న్యాయవాది వాదించారు. కనీసం అమ్ముకోవడానికీ ఆయన దగ్గర ఇతర వస్తువులు లేవని అన్నారు. అసలు ఆర్యన్ ఖాన్‌ను పార్టీకి ఆహ్వానించిన ప్రతీక్ గాబానే పోలీసులు అరెస్టు చేయలేదని వివరించారు.
Also Read: Mumbai Drugs Case : క్రూయిజ్ లో రేవ్ పార్టీకి ‘శానిటరీ న్యాప్ కీన్స్’లో డ్రగ్స్ సరఫరా...
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా వ్యవహారాన్ని నేరుగా ఆర్యన్ ఖాన్‌పై మోపుతున్నారని, ఇది అన్యాయమని ఆర్యన్ ఖాన్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదించారు. ఎన్‌సీబీ మరీ ఇంతలా దిగజారి ఈ ఆరోపణలు చేస్తుందని అనుకోలేదని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్‌సీబీ తీరు సరికాదని తెలిపారు. ఆయన క్లయింట్ ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన వరకు డ్రగ్స్ కొనుగోలు, ఎగుమతి, దిగుమతి, సరఫరాల వంటివేవీ లేవని స్పష్టం చేశారు. అందుకే వాటికి సంబంధించిన సెక్షన్‌ను ఎన్‌సీబీ పంచనామాలో పేర్కొనలేదని వాదించారు.