యూపీలో దారుణం... మైనర్ బాలికపై కన్నతండ్రితో సహా 28మంది అత్యాచారం

Published : Oct 13, 2021, 04:35 PM ISTUpdated : Oct 13, 2021, 04:44 PM IST
యూపీలో దారుణం... మైనర్ బాలికపై కన్నతండ్రితో సహా 28మంది అత్యాచారం

సారాంశం

కన్న తండ్రే కామాంధుడిగా మారి మైనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడటమే కాదు మరికొందరితో ఆమెపై అఘాయిత్యం చేయించిన అమానుషం ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. 

లక్నో: కన్న కూతురుని కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాసులకు కక్కుర్తిపడి కూతురి మానాన్ని మరికొందరికి అమ్ముకున్నాడు. మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. కొన్నేళ్లుగా తనపై జరిగుతున్న అకృత్యాల గురించి తాజాగా బాలిక బయటపెట్టింది. 

బాధిత బాలిక తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ట్రక్ డ్రైవర్ గా పనిచేసే తండ్రి ఆరో తరగతిలో వుండగానే బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. తల్లి ఇంట్లోలేని సమయంలో కొత్తబట్టలు కొనిపెడతానని ఒంటరిగా బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అప్పటినుండి పలుమార్లు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేవాడని... ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించేవాడని బాలిక తెలిపింది. 

read more  రాష్ట్రంలో ఏడుగురు విద్యార్థులు అదృశ్యం..కారణం అదేనా?

అయితే రానురాను తన తండ్రి మరింత నీచానికి దిగజారాడని... డబ్బుల కోసం తనను ఇతరుల వద్దకు పంపించేవాడని తెలిపింది. ప్రతిసారీ తనను ఓ హోటల్ కు తీసుకుని వెళ్లేవాడని... అక్కడ ఎవడో ఒకడు తనపై అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఓసారి సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ కూడా తండ్రితో కలిసి తన వద్దకు వచ్చాడని... అడ్డుచెబుతున్నా వినకుండా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక వెల్లడించింది.

ఇక అప్పటినుండి పలుమార్లు తిలక్ సోదరులు, స్నేహితులు, బందువులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. ఇలా తన తండ్రి సాయంతో ఇప్పటివరకు దాదాపు 28మంది అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక దయనీయంగా తెలిపింది. 17ఏళ్ల బాధిత బాలిక దయనీయ పరిస్థితి ప్రతిఒక్కరినీ కలిచివేస్తోంది. ముందు బాలిక తండ్రిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని... ఎంత పలుకుబడి వున్నా మిగతావారిని కూడా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు. 

read more  చిత్తూరు : బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం ... బొప్పాయి తోటలో శవమై తేలిన చిన్నారి

బాధిత బాలిక బయటపెట్టిన నిజాలు అతి త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్ వాది పార్టీ నేత తిలక్ యాదవ్ సోషల్ మీడియా వేదికన స్పందించారు. బాలిక ఆరోపణల్లో నిజం లేదని... తమను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నాడు. తనతో పాటు తన సోదరులకు ఈ అత్యాచార ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేదని తిలక్ యాదవ్ తెలిపారు. 
 

 

PREV
click me!

Recommended Stories

భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport
కేరళను ముంచెత్తిన వరదలు రోడ్లపై పడవలు | Kerala Floods 2026 Boats on Roads After Heavy Rains