దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగుతున్న వేళ.. అయోధ్య నగరానికి సంబంధించిన ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో (ISRO) విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉంటుందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ (ISRO satellite took a picture of Ayodhya temple from space)మనిపించింది.
దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమ ముహుర్తానికి ఇంకా మరి కొన్ని గంటలే సమయం ఉంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకను పురస్కరించుకొని దేశంలోని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆంక్షలు షురూ... ఆరు కిలోమీటర్ల దూరంలోనే అన్నీ బంద్
undefined
దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉంటుందో తెలిపే అయోధ్య చిత్రాన్ని తీసింది. ఇస్రో షేర్ చేసిన చిత్రంలో రామ మందిరం, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, సరయూ నదితో సహా మొత్తం పట్టణం యొక్క ఏరియల్ వ్యూ కనిపిస్తుంది.
జనవరి 22న (రేపు) జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయోధ్య నగరం మొత్తం అందంగా ముస్తాబు అయ్యింది. ఈ వేడుకకు హాజరుకావాలని ట్రస్ట్ దేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమితాబ్ బచ్చన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ సహా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
अंतरिक्ष से 🛕 ने अयोध्या के राम मंदिर की तस्वीरें खींचीं। दशरथ महल और सरयू नदी इन स्नैपशॉट में केंद्र बिंदु हैं।
विशेष रूप से, हाल ही में पुनर्निर्मित अयोध्या रेलवे स्टेशन विस्तृत छवियों में प्रमुखता से दिखाई देता है। आइए देखें... pic.twitter.com/di9jRDDkww
ప్రముఖు అయోధ్యకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోని తీసుకున్నాయి. రామమందిరం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలోనే బారీకేడ్లను ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేస్తున్నారు. కేవలం స్థానికులు, పాసులు వున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. అయోధ్య రామమందిరంతో పాటు నగరమంతా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.
షోయబ్ తో విడాకులు నిజమే.. కొత్త జంటకు విషెష్ చెప్పిన సానియా మీర్జా..
పదివేలమందికి పైగా రాష్ట్ర, కేంద్ర బలగాలు అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. 100 మందికి పైగా డిఎస్పీలు, 320 మంది సిఐలు, 800 మంది ఎస్సైలు, వేలాదిమంది కానిస్టేబుల్స్ అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే దాదాపు 10వేలకు పైగా సిసి కెమెరాలను అయోధ్య మొత్తం ఏర్పాటుచేశారు. అలాగే డ్రోన్ కెమెరాలను కూడా భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ ను సిద్దం చేశారు.