10 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన భారత ప్రజల సంపాదన: మోడీ

By narsimha lode  |  First Published Aug 18, 2023, 4:22 PM IST

దేశంలో ఆర్ధిక పరిస్థితికి సంబంధించి  రెండు  రిపోర్టులను  మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్‌బీఐ రిపోర్టుతో పాటు మరో రిపోర్టులు  భారత ఆర్ధిక వ్యవస్థను ప్రతిబింబించినట్టుగా మోడీ పేర్కొన్నారు.



న్యూఢిల్లీ: దేశంలోని మధ్య తరగతి ప్రజల ఆదాయం పదేళ్లలో  మూడు రెట్లు పెరిగింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇండియా ఆర్ధిక వ్యవస్థ పురోగతికి సంబంధించిన డేటాను తన లింక్‌డ్ ఇన్ ఖాతా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఎస్‌బీఐ  రిపోర్టు,  సీనియర్ జర్నలిస్ట్  అనిల్ పద్మనాభన్  రిపోర్టుల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. అయితే  ఈ రెండు  రిపోర్టుల గురించి తనకు సంతోషాన్ని ఇచ్చాయని మోడీ పేర్కొన్నారు.భారత్ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని  మోడీ  పేర్కొన్నారు. ఇండియాకు  చెందిన డేటా ను  షేర్ చేశారు.

Latest Videos

undefined

గత  9 ఏళ్లలో  భారత ప్రజల ఆదాయం పెరిగిందని  డేటాను  మోడీ షేర్ చేశారు.  2013-14 నుండి ఇప్పటి వరకు ఆదాయ పన్ను చెల్లింపుల పెరుగుదలకు సంబంధించిన డేటాను  ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదాయ పన్ను చెల్లింపు దారుల  సంఖ్య మూడు నుండి నాలుగు రెట్లు  పెరుగుదలను సూచిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.మరోవైపు  పలు రాష్ట్రాల్లో  ఆదాయ పన్ను చెల్లింపులు కూడ పెరిగిన డేటాను మోడీ ప్రస్తావించారు.ఆదాయ పన్ను దాఖలులో  యూపీ  రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2014 జూన్ లో యూపీ రాష్ట్రంలో 1.65 లక్షల ఆదాయ పన్ను చెల్లింపులు చేస్తే ఈ సంఖ్య 11.92 లక్షలకు పెరిగినట్టుగా మోడీ గుర్తు చేశారు.

ఈశాన్య రాష్ట్రాలైన  మణిపూర్, నాగాలాండ్, మిజోరం  వంటి రాష్ట్రాల్లో  కూడ  9 ఏళ్లలో  ఆదాయ పన్ను  దాఖలులో  20 శాతం వృద్ధి సాధించినట్టుగా మోడీ  పేర్కొన్నారు.ఈ డేటా ఇండియా వృద్దిని సూచిస్తున్నట్టుగా  ప్రధాని చెప్పారు. 

click me!