Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఒడిశాను ముంచెత్తిన భారీ వ‌ర్షాలు

Published : Aug 18, 2023, 03:25 PM IST
Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఒడిశాను ముంచెత్తిన భారీ వ‌ర్షాలు

సారాంశం

Odisha faces heavy rain: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Odisha faces heavy rain: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందనీ, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు చురుగ్గా ఉందనీ, రాగల రెండు మూడు రోజుల పాటు పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

కియోంజర్ జిల్లాలోని టెల్కోయ్ (182.6 మిల్లీ మీట‌ర్లు), కటక్ జిల్లాలోని బంకి (182 మిల్లీ మీట‌ర్లు), బోలంగీర్ జిల్లాలోని గుడ్వెల్లా (139.8 మిల్లీ మీట‌ర్లు), పూరీ జిల్లాలోని పిపిలి (122మిల్లీ మీట‌ర్లు) ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ కార్యాలయం తెలిపింది. అలాగే, ఖుర్దా పట్టణంలో శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు హిరాకుడ్ (87.8 మిల్లీ మీట‌ర్లు), నబరంగ్‌పూర్ (81 మిల్లీ మీట‌ర్లు), కియోంజర్ (70.6 మిల్లీ మీట‌ర్లు), పూరి (69.6 మిల్లీ మీట‌ర్లు), భువనేశ్వర్ (63.8 మిల్లీ మీట‌ర్లు), టిట్లాగఢ్ (60.8 మిల్లీ మీట‌ర్లు) భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

ఐఎండీ అంచనా ప్రకారం, మయూర్‌భంజ్, భద్రక్, బాలాసోర్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పూర్, నయాఘర్, ధెంకనల్, అంగుల్, జాజ్‌పూర్, కియోంజర్, ఖుర్దా, కటక్, పూరి, గంజాం, గజపతి, కోరాపుట్, రాయగడ, కలహండి, కంధమాల్ జిల్లాలు భారీ వర్షాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.  ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం చురుగ్గా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వ్యవస్థ రానున్న రెండు మూడు రోజులపాటు పశ్చిమ-వాయువ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది.

భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంత‌కుముందు ఎల్లో అల‌ర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలావుండగా, ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలనీ, లోతట్టు ప్రాంతాల్లో తాత్కాలికంగా నీరు నిలవడం, తీవ్రమైన వర్షాల సమయంలో దృశ్యమానత తక్కువగా ఉండటం, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu