దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

Published : Oct 20, 2018, 12:54 PM IST
దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

సారాంశం

అమృత్‌సర్‌లోని  రైలు పట్టాల పక్కనే  దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని రైల్వే బోర్డు ఛైర్మెన్  అశ్విని లొహానీ ప్రకటించారు. 

అమృత్‌సర్: అమృత్‌సర్‌లోని  రైలు పట్టాల పక్కనే  దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని రైల్వే బోర్డు ఛైర్మెన్  అశ్విని లొహానీ ప్రకటించారు. రైలు పట్టాలపైకి వస్తారని  తాము ఊహించలేదన్నారు.

అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై అశ్విని లొహాని ఓ ప్రకటనను శనివారం నాడు విడుదల చేశారు.  అమృత్‌సర్, మానావాల స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగిందన్నారు.  ప్రమాదం జరిగిన ప్రాంతం లెవల్ క్రాసింగ్ కూడ  కాదన్నారు. ఈ స్టేషన్ల మధ్య  పట్టాలపై రైళ్లు నిర్ణీత వేగంతో వెళ్తాయన్నారు.

లెవల్ క్రాసింగ్ వద్ద మాత్రమే  రైల్వే సిబ్బంది ఉంటారని  ఆయన గుర్తు చేశారు. పట్టాలపై జనం  నిలబడి ఉన్న విషయాన్ని గుర్తించిన  రైలు డ్రైవర్ అత్యవసరంగా బ్రేక్‌లు కూడ వేశాడని ఆయన గుర్తు చేశారు. ట్రాక్ పక్కనే దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తమకు తెలియదన్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. 

రైల్వే ట్రాక్‌లపైకి జనం రాకూడదని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్న ఈ సందర్భంగా ఆయన ఆ ప్రకటనలో గుర్తు చేశారు. సంఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. 

పంబాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో జోడా ఫాఠక్‌ ప్రాంతంలోని ఓ మైదానంలో నిర్వహించిన  నిలబడి రావణదహనం చూస్తుండగా జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు దూసుకెళ్లి 61మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు