గమ్యాన్ని చేరడానికి ముందే గుడ్‌న్యూస్ .. సౌర జ్వాలను రికార్డు చేసిన ఆదిత్య ఎల్ 1 , ఇస్రో ఏం చెప్పిందంటే..?

By Siva Kodati  |  First Published Nov 8, 2023, 9:41 PM IST

ఆదిత్య ఎల్ 1.. భూమి నుంచి బయల్దేరిన తర్వాత 120 రోజులకు సూర్యుడికి దగ్గరగా వుండే లాగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోవాల్సి వుంది. సూర్యుడి నుంచి వెలువడే మొట్టమొదటి కాంతి కిరణాల తీవ్రతను ఆదిత్య ఎల్ 1లో అమర్చిన ‘‘ హై ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (హెచ్ఈఎల్ 1ఓఎస్) రికార్డు చేసింది.


చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై ప్రపంచం దృష్టి పెట్టింది. అగ్రరాజ్యాల కంటే చాలా తక్కువ ఖర్చుతోనే భారీ ప్రయోగాలు చేపట్టడంతో .. మన విజయ రహస్యం ఏంటన్నది తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే ఊపులో ఇస్రో చేపట్టిన మిషన్ ‘‘ఆదిత్య ఎల్ 1’’. ఏళ్లుగా మనిషికి కొరకరాని కొయ్యగా మారిన సూర్యుడి గుట్టు విప్పేందుకు ఇస్రో ఈ యాత్ర చేపట్టింది.

కణకణ మండే సూర్యుడి దగ్గరికి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు.. అందుకే ఈ మిషన్‌ను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆదిత్య ఎల్ 1.. భూమి నుంచి బయల్దేరిన తర్వాత 120 రోజులకు సూర్యుడికి దగ్గరగా వుండే లాగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోవాల్సి వుంది. ప్రస్తుతం ఆ దిశగానే రాకెట్ ప్రయాణిస్తోంది. అలాగే తన ప్రయాణంలో కీలక సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తూనే వుంది. 

Latest Videos

భూ కక్ష్యను దాటి సూర్యుడి వైపు వడివడిగా దూసుకెళ్తోన్న ఆదిత్య ఎల్ 1 .. లాగ్రాంజ్ పాయింట్‌కు చేరువ అవుతోంది. అక్కడికి పూర్తి స్థాయిలో చేరడానికి నెల రోజుల సమయం పడుతుందని ఇస్రో తెలిపింది. కానీ నిర్దేశిత గమ్యానికి చేరుకోవడానికి ముందే ఆదిత్య ఎల్ 1 తన పనిని ప్రారంభించింది. సూర్యుడి నుంచి వెలువడే మొట్టమొదటి కాంతి కిరణాల తీవ్రతను ఆదిత్య ఎల్ 1లో అమర్చిన ‘‘ హై ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (హెచ్ఈఎల్ 1ఓఎస్) రికార్డు చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 29వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చోటు చేసుకున్న సౌర కార్యకలాపాలను ఈ హెచ్ఈఎల్1ఓఎస్ రికార్డు చేసింది. 

 

has published the first observation made by the HEL1OS payload on of X-Ray light curves due to solar flares. ☀️

You can see the data from Aditya-L1 and the GOES-18 spacecraft in this graph. Notice the difference in sensitivity of both instruments! pic.twitter.com/mitXhwAbyt

— ISRO Spaceflight (@ISROSpaceflight)

 

ఈ సౌర జ్వాలలు కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ వుంటాయని ఈ మీటర్ పసిగట్టింది. సెకనులో పదోవంతు సమయంలోనే ఈ సౌరజ్వాల ఆకస్మికంగా ఎగిసిపడుతున్నాయని పేర్కొంది. సౌర వాతావరణం ఆకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారు. భూమి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత ఆదిత్య ఎల్ 1 అందించిన మొట్టమొదట ఇస్రోకు అందించిన సమాచారం ఇదే కావడం గమనార్హం. సౌర జ్వాల నుంచి 10 నిమిషాల వ్యవధిలో కొన్ని వందల ఎర్గ్‌ల శక్తి విడుదల అవుతోందని ఇస్రో పేర్కొంది. 

ఆదిత్య-L1 ,  మిషన్ లక్ష్యాలు ఏమిటి?

>> ప్రతిష్టాత్మకమైన ఆదిత్య-L1 మిషన్ సూర్యుడి గురించి అనేక అంశాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుంది:

>> ఇది సూర్యుని ఎగువ వాతావరణ (క్రోమోస్పియర్, కరోనా) డైనమిక్స్‌ను అధ్యయనం చేయాలని యోచిస్తోంది.

>>  మిషన్ క్రోమోస్పిరిక్ ,  కరోనల్ హీటింగ్, పాక్షికంగా అయనీకరణం చేయబడిన ప్లాస్మా ,  భౌతికశాస్త్రం, కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు ,  మంటలను కూడా అధ్యయనం చేస్తుంది.

>> ఆదిత్య-L1 సౌర కరోనా ,  హీటింగ్ మెకానిజం ,  భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని యోచిస్తోంది.

>> కరోనల్ ,  కరోనల్ లూప్ ప్లాస్మా నిర్ధారణలను ఇస్రో పరిశీలిస్తుంది. 

>> CMEల (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) అభివృద్ధి, డైనమిక్స్ ,  మూలాన్ని కూడా ఈ మిషన్ అధ్యయనం చేస్తుంది.

 >> ఆదిత్య-L1 సూర్యుని ,  బహుళ పొరల (క్రోమోస్పియర్, బేస్ ,  ఎక్స్‌టెండెడ్ కరోనా) వద్ద జరిగే ప్రక్రియల క్ర`మాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలు చివరికి సౌర విస్ఫోటనం సంఘటనలకు దారితీస్తాయి.

>> సౌర కరోనాలోని మాగ్నెటిక్ ఫీల్డ్ టోపోలాజీ, అయస్కాంత క్షేత్ర కొలతలు కూడా అధ్యయనం చేయనుంది.

>> ఆదిత్య-L1 అంతరిక్ష వాతావరణం, అంటే మూలం, కూర్పు ,  డైనమిక్స్ లేదా సౌర గాలి కోసం డ్రైవర్లను గమనించి, అధ్యయనం చేస్తుంది.
 

click me!