డిసెంబర్ 2వ వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్..?

Siva Kodati |  
Published : Nov 08, 2023, 07:17 PM IST
డిసెంబర్ 2వ వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్..?

సారాంశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డిసెంబర్ 2వ వారం నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం వుందని సమాచారం.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డిసెంబర్ 2వ వారం నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం వుందని సమాచారం. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం వుంది. ఈ బిల్లులను ఇప్పటికే హోం శాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్, ఎన్నికల కమీషనర్ల నియామకానికి సంబంధించిన మరో బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో వుంది.

నిజానికి వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకురావాలని భావించినప్పటికీ విపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్లు నిరసన తెలపడంతో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టలేదు. సీఈసీ, ఈసీ హోదాలను కేబినెట్ కార్యదర్శి ర్యాంక్‌కి తీసుకురావడానికి కేంద్రం ఈ బిల్లు తీసుకురావాలని భావించింది. ప్రస్తుతం వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో వున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్ని కనీసం 12 రోజులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !