రేప్, అపహరణ కేసులు: నిత్యానంద కోసం ఇంటర్ పోల్ నోటీసు

By telugu teamFirst Published Jan 22, 2020, 5:07 PM IST
Highlights

నిత్యానందను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ నోటీసు జారీ అయింది. ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అత్యాచారం, నిర్బంధం కేసుల్లో గుజరాత్, కర్ణాటక పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్నారు.

న్యూఢిల్లీ: అత్యాచార, లైంగిక దోపిడీ కేసులను ఎదుర్కుంటున్న స్వామి నిత్యానందను పట్టుకోవడానికి సహకరించాలని దేశాలను కోరుతూ ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్ పోలీసులు విజ్ఞప్తిపై ఇంటర్ పోల్ ఆ నోటీసులు జారీ చేసింది.

బ్లూ కార్నర్ నోటీసును జారీ చేసిన వ్యక్తికి సంబంధించన సమాచారం తెలిస్తే తప్పనిసరిగా సమాచారం అందించాల్సి ఉంటుంది. నిత్యానంద ఇటీవలి కాలంలో రహస్య ప్రదేశాల నుంచి వీడియోల్లో కనిపిస్తూ విచిత్రమైన ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. పలు సమన్లు జారీ చేసినప్పటికీ అతను స్పందించలేదు. 

Also Read:ఇక నన్నెవరూ తాకలేరు, నేను పరమ శివుడ్ని: స్వామి నిత్యానంద

తమ వద్ద నిత్యానంద లేడని గత నెలలో ఈక్వెడార్ స్పష్టం చేసింది. తనకు ఆశ్రయం ఇవ్వాలని నిత్యానంద చేసిన విజ్ఞప్తిని తోసి పుచ్చినట్లు కూడా తెలిపింది. తమ దేశం నుంచి హైతీకీ అతను వెళ్లిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ తెలిపింది. 

నిత్యానంద ఓ దీవిని కొనుగోలు చేసి కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఈక్వెడార్ ఖండించింది. విరాళాలు సేకరించడానికి అహ్మదాబాద్ లోని ఆశ్రమంలో కిడ్నాప్ చేసి బాలికను నిర్బంధించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న నిత్యానంద కోసం గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. 

Also Read: సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద: పేరు ఇదే..!!.

ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన సంఘటనపై నిత్యానంద మీద కేసులో నమోదు చేశారు. అత్యాచార ఆరోపణలపై, ఓ నటితో రాసలీలలు చేస్తూ వీడియోలో కనిపించిన సంఘటనపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు 2010లో అతన్ని అరెస్టు చేశారు. 

డిసెంబర్ లో నిత్యానంద పాస్ పోర్టను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త పాస్ పోర్టు కోసం పెట్టుకున్న దరఖాస్తును తోసిపుచ్చింది. నిత్యానందను పట్టుకోవడానికి విదేశీ సంస్థల సహకారం అడిగినట్లు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. 

Also Read: నిత్యానందపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!

click me!