అయోధ్యలో విధ్వంసానికి టెర్రరిస్టు కుట్ర.. భద్రత కట్టుదిట్టం

By Siva KodatiFirst Published Jul 29, 2020, 2:34 PM IST
Highlights

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లుగా భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లుగా భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం వుందని హెచ్చరించింది. భారత్‌లో దాడులు చేసి అంతర్గతంగా కల్లోలం సృష్టించాలని ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని భారత గూఢచార సంస్థ రా అధికారులు వెల్లడించారు.

మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు మనదేశంలోకి చొరబడేందుకు చూస్తున్నాయని ఇందుకు పాకిస్తాన్ సాయం చేస్తోందని తెలిపారు. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.

Also Read:అయోధ్య ఎలా వెళతారు.. ఆ ప్రమాణం మరిచిపోయారా: మోడీపై అసదుద్దీన్ వ్యాఖ్యలు

అయోధ్యతో పాటు కాశ్మీర్‌లోనూ దాడులు చేసేందుకు వీరికి పాకిస్తాన్‌లోని జలాలాబాద్‌లో ట్రైనింగ్ ఇచ్చినట్లుగా రా తెలిపింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా అధికారులు సరిహద్దుల వెంబడి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కాగా ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి శంకుస్తాపన చేయనున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి  ఆ రోజుకు సరిగ్గా ఏడాది పూర్తికానుండటం విశేషం. 

click me!