ఆన్‌లైన్ పాఠాలు: పేలిన మొబైల్, విద్యార్ధినికి గాయాలు

Published : Jul 29, 2020, 02:25 PM IST
ఆన్‌లైన్ పాఠాలు: పేలిన మొబైల్, విద్యార్ధినికి గాయాలు

సారాంశం

కరోనా కారణంగా స్కూల్స్ ప్రారంభం కాలేదు. అయితే ప్రైవేట్ స్కూల్స్ ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాయి. ఒడిశాకు చెందిన ఓ విద్యార్ధిని ఆన్ లైన్ లో పాఠాలు వింటున్న సమయంలో మొబైల్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో విద్యార్ధిని స్వల్ప గాయాలతో బయటపడింది.


పూరీ: కరోనా కారణంగా స్కూల్స్ ప్రారంభం కాలేదు. అయితే ప్రైవేట్ స్కూల్స్ ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాయి. ఒడిశాకు చెందిన ఓ విద్యార్ధిని ఆన్ లైన్ లో పాఠాలు వింటున్న సమయంలో మొబైల్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో విద్యార్ధిని స్వల్ప గాయాలతో బయటపడింది.

ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలోని ఆదర్శనగర్ కు చెందిన  కేంద్రీయ విద్యాలయంలో ఏడవ తరగతి చదువుతోంది రూప్సా పలై.మంగళవారం నాడు క్లాస్ వింటున్న సమయంలో ఆమె మొబైల్ ఫోన్ పేలింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. 

పాఠశాలలు మూత పడడంతో ఆన్ లైన్ తరగతుల వైపు విద్యార్థులు అనివార్యంగా నెట్టివేయబడ్డారు. అయితే ఈ ఘటన మొబైల్ ఫోన్లను ఉపయోగించే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తేలింది. ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఆన్ లైన్ లో పాఠాలు వినే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను  గమనించాల్సిన  అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.మొబైల్ ఫోన్లు ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల వేడేక్కే అవకాశం ఉంది. దీంతో అవి పేలిపోతాయని మొబైల్ వ్యాపారి  తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం