జయలలిత ఇంట్లో 4 కిలోల 372 గ్రాముల బంగారం: తమిళనాడు సర్కార్

By narsimha lodeFirst Published Jul 29, 2020, 1:49 PM IST
Highlights

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయంలో ఆస్తుల వివరాలను  తమిళనాడు ప్రభుత్వం వెబ్ సైట్ లో ప్రకటించింది.
వేద నిలయం జయలలిత స్మారక చిహ్నాంగా మార్చనున్నారు. ఈ మేరకు ఈ ఏడాది మే 22వ తేదీన తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది.
 

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయంలో ఆస్తుల వివరాలను  తమిళనాడు ప్రభుత్వం వెబ్ సైట్ లో ప్రకటించింది.
వేద నిలయం జయలలిత స్మారక చిహ్నాంగా మార్చనున్నారు. ఈ మేరకు ఈ ఏడాది మే 22వ తేదీన తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది.

అయితే ఈ ఆర్డినెన్స్ ప్రకారంగా జయలలిత నివాసంలలో స్థిర, చరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వెబ్ సైట్ లో ప్రకటించింది.

నాలుగు కిలోల 372 గ్రాముల బంగారం ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందులో 14 బంగారు ఆభరణాలు ఉన్నాయని ప్రకటించింది.
867 వెండి ఆభరణాలు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. వెండి ఆభరణాలు 601 కిలోల 424 గ్రాములు.ఇక వెండి వస్తువులు 162 ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

11 టీవీలు, 10 ప్రిజులు, 38 ఎయిర్ కండిషన్లు, 556 ఫర్నీచర్ వస్తువులున్నాయని ప్రభుత్వం తెలిపింది. కిచెన్ కు సంబంధించిన వస్తువులు సుమారు 6514 గా ప్రభుత్వం తెలిపింది.

కిచెన్ రాక్స్, ఫర్నీచర్ 12, కత్తులకు సంబంధించిన వస్తువులు 1055, పూజకు సంబంధిచినవి 15 ఉన్నాయని తమిళనాడు అధికారులు తెలిపారు.

బట్టలు, పిల్లో కవర్లు, కర్టెన్లు, చెప్పులు 10,438 ఉన్నాయి. టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు 29ని గుర్తించారు. కిచెన్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు 221 ఉన్నాయి. ఎలక్ట్రికల్ వస్తువులు 251, పుస్తకాలు 8376, మెమరీస్ 394 ఉన్నాయి.

ఐటీ స్టేట్ మెంట్స్ 653, స్టేషనరీ ఐటమ్స్ 253, సూట్ కేసులు 65, కాస్మోటిక్స్ ఐటమ్స్ 108, లేజర్ ప్రింటర్ 1 ఉన్నాయని ప్రభుత్వం వివరించింది. ఈ ఇంట్లో మొత్తం 32,721 వస్తువులు ఉన్నట్టుగా వెబ్ సైట్ లో వివరించింది.


 

click me!