ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లలేదు.. కానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. బీహార్ కుబేరుడి సక్సెస్ స్టోరీ ఇది..!

By Mahesh Rajamoni  |  First Published Aug 24, 2023, 3:42 PM IST

కాలేజీకి వెళ్లకుండా.. కోట్లను సంపాదించి కుబేరుడు అవ్వడమంటే నమ్మేలా లేదు కదా.. ఇది ఒక బీహార్ కుబేరుడి కథ. ఇతని సంపాదన ఎంతో తెలుసా? అక్షరాల రూ.16,000 కోట్లు.
 



కోట్లు సంపాదించాలన్నా.. మనం కలలు గన్న సామ్రాన్ని స్థాపించాలన్నా.. ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. లేదంటే మన కల కలలాగే మిగిలిపోతుంది. జీవితంలో పైకి వచ్చినవారి జీవితం అంత ఈజీగా ఏం సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా తమ ఆశయాన్ని వదులుకోలేదు. అందుకే ఈ రోజు వారి అంత స్థాయికి వెళ్లారు. కోట్లకు అధిపతి అయ్యారు. ఇలాంటి వారిలో వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ ఒకరు. ఇప్పుడు ఈయన సంపాదన కోట్లలో ఉంది. ఈ బీహార్ కుబేరుడి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

అనిల్ అగర్వాల్ 1954 లో పాట్నాలోని ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బలంగా ఏం లేదు. అతని తండ్రి పేరు ద్వారకా ప్రసాద్ అగర్వాల్. ఇతను చిన్న అల్యూమినియం కండక్టర్ వ్యాపారం చేసేవాడు. కాగా ఒక చిన్న స్క్రాప్ మెటల్ వ్యాపారాన్ని నిర్వహించడం నుంచి నాలుగు దశాబ్దాల క్రితం మైనింగ్, పెట్రోలియంతో కూడిన వాణిజ్య సామ్రాజ్యంతో భారతదేశపు ధనిక టైకూన్లలో ఒకరిగా ఎదిగాడు అనిల్ అగర్వాల్.

Latest Videos

ఇకపోతే అనిల్ అగర్వాల్ హైస్కూలు పూర్తి చేశాక.. చదువు కోకుండా 15 ఏండ్ల వయసులో వ్యాపారంలో తండ్రికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. 19 ఏండ్ల వయసులో అనిల్ కెరీర్ అవకాశాల కోసం పాట్నా నుంచి ముంబైకి వెళ్లాడు. అనిల్ అగర్వాల్ కృష్ణుని భక్తుడు. ఇతను శాకాహారి కూడా. అయితే ఈయనకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అనిల్ అగర్వాల్ తన ఫ్రెండ్, కుటుంబ స్నేహితుడు కిరణ్ గుప్తాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ప్రియ అనే కుమార్తె, అగ్నివేశ్ అనే కుమారుడు ఉన్నారు.

కాగా జైపూర్ లోని మాలవీయ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అనిల్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ) పట్టా పొందారు. ఇతర రాష్ట్రాల్లోని కేబుల్ కంపెనీల నుంచి స్క్రాప్ మెటల్ సేకరించి ముంబైలో విక్రయించడం ప్రారంభించాడు.

undefined

1970 ల మధ్యలో అగర్వాల్ సొంతంగా స్క్రాప్ మెటల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అనిల్ అగర్వాల్ 1976లో బ్యాంకు రుణంతో హంషేర్ స్టెర్లింగ్ కార్పొరేషన్ ను స్థాపించారు. ఆ తర్వాత వేదాంత రిసోర్సెస్ ను స్థాపించి అభివృద్ధి చేశారు. ఒక పది సంవత్సరాల తర్వాత అతను స్టెరిలైట్ ఇండస్ట్రీస్ ను స్థాపించాడు. ఇది 1993 లో ప్రైవేట్ రంగంలో భారతదేశపు మొదటి రాగి స్మెల్టర్, రిఫైనరీని స్థాపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతను మైనింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో) లో 51%, ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్జెడ్ఎల్ (హిందుస్తాన్ జింక్ లిమిటెడ్) లో సుమారు 65% కొనుగోలు చేశాడు.

విదేశీ మూలధనాన్ని పొందడానికి అతను 2003 లో లండన్ లో వేదాంత రిసోర్సెస్ ను స్థాపించాడు. ఆయిల్ అండ్ గ్యాస్, అల్యూమినియం, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, విద్యుత్ ఉత్పత్తిలో హోల్డింగ్స్ తో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యభరితమైన సహజ వనరుల సమ్మేళనంగా మారిపోయింది. గుజరాత్ లో సెమీకండక్టర్, డిస్ ప్లే ప్లాంట్ల నిర్మాణానికి తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ తో కలిసి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

ధార్మిక కార్యక్రమాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు 1992లో వేదాంత ఫౌండేషన్ ను అనిల్ అగర్వాల్ స్థాపించారు. కాగా ఇతను బిల్ గేట్స్ ను స్ఫూర్తిగా తీసుకుని తన కుటుంబ సంపదలో 75 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం 2022లో అనిల్ అగర్వాల్ సంపద 2.01 బిలియన్ డాలర్లు.

click me!