పాకిస్తాన్ దుస్సాహసం.. భారత మత్స్యకారులపై పాక్‌ నేవీ కాల్పులు.. ఒకరు మృతి

By team teluguFirst Published Nov 7, 2021, 4:15 PM IST
Highlights

దాయాది దేశం మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. గుజరాత్ తీరానికి సమీపంలో పాక్ అధికారులు భారత మత్స్యకారులపై (Indian fishermen) కాల్పులు జరిపారు. పాకిస్తాన్ నౌకదళం (Pakistan Navy) జరిపిన ఈ కాల్పుల్లో ఓ భారతీయ మత్స్యకారుడు మరణించాడు. 


దాయాది దేశం మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. గుజరాత్ తీరానికి సమీపంలో పాక్ అధికారులు భారత మత్స్యకారులపై (Indian fishermen) కాల్పులు జరిపారు. పాకిస్తాన్ నౌకదళం (Pakistan Navy) జరిపిన ఈ కాల్పుల్లో ఓ భారతీయ మత్స్యకారుడు మరణించాడు. గుజరాత్‌ ద్వారకాలోని ఓ ఖా పట్ణణం సమీపంలో జల్సారి పేరు గల బోటుపై పాకిస్తాన్ నేవి కాల్పులకు పాల్పడింది. ఇందులో ఒక మత్స్యకారుడు మృతిచెందగా, మరోకరు గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాక్ అధికారులు కాల్పులు జరిపినప్పుడు బోట్.. భారత సరిహద్దుల్లోనే ఉంది.

మృతిచెందిన మత్స్యకారుడిని శ్రీధర్‌గా గుర్తించారు. గాయపడిన మరో మత్య్సకారుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీధర్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. అయితే భారత మత్స్యకారులు తమ పనుల్లో నిమగ్నమైన సమయంలో పడవను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది. భారత జాలర్లను అరెస్ట్ చేయడం, వారి పడవలను జప్తు చేయడం వంటి చర్యలు చేపట్టింది. 

ఈ ఏడాది మార్చిలో 11 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అధికారులు అరెస్టు చేశారు. వారి రెండు పడవలను జప్తు చేశారు. ఫిబ్రవరిలో కూడా.. దేశ జలాల్లోకి ప్రవేశించినందుకు 17 మంది భారతీయ జాలర్లను పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు. వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు.

click me!