మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్‌.. నవంబర్ 12 వరకు ఈడీ కస్టడీకి అనుమతి

Published : Nov 07, 2021, 03:31 PM IST
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్‌.. నవంబర్ 12 వరకు ఈడీ కస్టడీకి అనుమతి

సారాంశం

మనీలాండరింగ్ కేసులో ఆరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌‌‌ను (Anil Deshmukh) బాంబే హైకోర్టు (bombay high court) భారీ షాక్ ఇచ్చింది. ఆయనను నవంబర్ 12వ తేదీ వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీకి అనుమతించింది

మనీలాండరింగ్ కేసులో ఆరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌‌‌ను (Anil Deshmukh) బాంబే హైకోర్టు (bombay high court) భారీ షాక్ ఇచ్చింది. ఆయనను నవంబర్ 12వ తేదీ వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీకి అనుమతించింది. శనివారం స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో ఆరు రోజుల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇక, శనివారం అనిల్ దేశ్‌ముఖ్‌కు స్పెషల్ కోర్టు 14 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అనిల్ దేశ్‌ముఖ్‌ను మరో 9 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలనే ఈడీ అధికారుల జ్ఞప్తిని ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఆయనను జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపింది.

ముంబైలోని బార్లు రెస్టారెంట్లు నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు... ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. దీంతో అనిల్ దేశ్‌ముఖ్ ఈ ఏడాది ఏప్రిల్ 5న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ allegations నేపథ్యంలో అనిల్ పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. మనీ లాండరింగ్ పై తనపై ఆరోపణలు  వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్ దేశ్ ముఖ్  ఓ వీడియోను విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఆవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 31న ఆరోపణలు ఎదుర్కొంటునన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. 

Also read: రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటే తొలి నిర్ణయం ఇదే..! రాహుల్ సమాధానమిదే

సీబీఐ విచారణ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశ్‌ముఖ్‌ను విచారిస్తోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి అనిల్ దేశ్‌ముఖ్‌ నోటీసులు కూడా పంపింది. ఇక, నవంబర్ 1వ తేదీన ఆయనను సుదీర్ఘంగా 12 గంటల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం నవంబర్ 6వ తేదీ వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈడీ కస్టడీ శనివారంతో ముగియనుండటంతో ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే ఈడీ అధికారులు మరిన్ని రోజులు కస్టడీ కొరినప్పటికీ స్పెషల్ కోర్టు అంగీకరించలేదు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలను పక్కకు పెట్టిన బాంబే హైకోర్టు.. ఆయనను నవంబర్ 12 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. 

Also read: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే కుట్ర.. సెల్ఫీ వైరల్ కావడంతో విఫలం : వాంఖడేపై మంత్రి ఆరోపణలు

ఇక,  డిసెంబరు-ఫిబ్రవరి మధ్య ముంబైలోని బార్ యజమానుల నుంచి రూ. 4 కోట్లకు పైగా వసూలు చేసిన నగదును ఢిల్లీలోని నాలుగు షెల్ కంపెనీల ద్వారా నాగ్‌పూర్‌లోని అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన ఛారిటబుల్ ట్రస్ట్‌కు తరలించినట్లు కేంద్ర ఏజెన్సీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అనిల్ దేశ్‌ముఖ్ సహచరులైన కుందన్ షిండే, సంజీవ్ పలాండేలను కూడా ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు

 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం