దేశంలోని 59 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: దేశంలోని 59 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.
సోమవారంనాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడం 7.5 రోజులకు తగ్గిందన్నారు.గత 24 గంటల్లో 1553 కొత్త కేసులు నమోదైనట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు 36 మంది మృతి చెందారన్నారు.ఇప్పటివరకు 17615 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 543 మంది మృతి చెందినట్టుగా కేంద్రం ప్రకటించింది.
ముంబై, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కత్తా పట్టణాల్లో కరోనా కేసు తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.కరోనా వైరస్ జాతీయ సగటు రెట్టింపు రేటు కంటే 18 రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబర్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
పాండిచ్చేరిలోని మహే, కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు, ఉత్తరాఖండ్ లోని పౌరి గరువాల్ లో గత 28 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.
also read:వైద్యులు, ఆసుపత్రులపై దాడులు ఆపకపోతే ఈ నెల 23న బ్లాక్ డే:ఐఎంఏ వార్నింగ్
కేంద్ర ప్రభుత్వం ఆరు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని కేంద్రం ప్రకటించింది.
కరోనా సోకిన వారిలో 15 శాతం తీవ్రమైన కేసులుగా, మరో 5 శాతం కేసులు క్లిష్టంగా మారుతున్నాయని గణాంకాలు చెబుతున్నట్టుగా లవ్ అగర్వాల్ తెలిపారు.
జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకడం దురదృష్టకరమైందిగా ఆయన అభిప్రాయపడ్డారు