కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో లాక్‌డౌన్ సడలింపు నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం సోమవారం నాడు వెనక్కి తీసుకొంది. ఇవాళ్టి నుండి సరి-బేసి విధానంలో వాహనాలను అనుమతి ఇస్తామని కేరళ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరువనంతపురం: కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో లాక్‌డౌన్ సడలింపు నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం సోమవారం నాడు వెనక్కి తీసుకొంది. ఇవాళ్టి నుండి సరి-బేసి విధానంలో వాహనాలను అనుమతి ఇస్తామని కేరళ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవాళ్టి నుండి రెస్టారెంట్లు, పుస్తకాల దుకాణాలు, బార్బర్ షాపుల తెరవాలని కేరళ సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ మినహయింపుల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కేరళ తీసుకొన్న నిర్ణయంపై కేంద్రం సీరియస్ గా స్పందించింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ఇవాళ లేఖ రాసింది.
కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేరళ సర్కార్ లాక్‌డౌన్ నిబంధనల సడలింపుపై వెనక్కు తగ్గింది. గతంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం నాడు ఉపసంహరించుకొంది.
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఆర్మీని దించాలంటూ సుప్రీంలో పిటిషన్
లాక్ డౌన్ సడలింపుల విషయంలో ఏ మాత్రం జాప్యం చేసినా కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్రం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను యథావిధిగా అమలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని కేరళ సర్కార్ స్పష్టం చేసింది. సమాచార సమన్వయలోపం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది.