వైద్యులపై, ఆసుపత్రులపై దాడులను ఆపడంలో విఫలమైతే ఈ నెల 23 వ తేదీన బ్లాక్ డే నిర్వహిస్తామని ఐఎంఏ ప్రకటించింది.కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చోటు చేసుకొన్నాయి.
న్యూఢిల్లీ:వైద్యులపై, ఆసుపత్రులపై దాడులను ఆపడంలో విఫలమైతే ఈ నెల 23 వ తేదీన బ్లాక్ డే నిర్వహిస్తామని ఐఎంఏ ప్రకటించింది.కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చోటు చేసుకొన్నాయి.
తెలంగాణ, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ ఈ రకమైన దాడులు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు కూడ సీరియస్ గా తీసుకొన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కేసులు కూడ పెట్టారు.
also read:కేంద్రం ఆగ్రహం: లాక్‌డౌన్ నిబంధనల సడలింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకొన్న కేరళ
పనిచేస్తున్న ప్రాంతాల్లో రక్షణ కల్పించడంతో పాటు అవసరమైన రక్షిత పరికరాలను ఇవ్వాలని ఐఎంఏ ప్రభుత్వాలను కోరింది. డాక్టర్లపై, వైద్య సిబ్బందిపై దాడులను ఆపాలని విన్నవించింది.
దాడులను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీ రాత్రి 9 గంటలకు వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు క్యాండిల్ నిర్వహించనున్నట్టుగా ఐఎంఏ ప్రకటించింది.
వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులను ఆపకపోతే ఈ నెల 23వ తేదీన బ్లాక్ డే నిర్వహిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆ రోజున వైద్యులంతా నల్ల బ్యాడ్జీలతో హాజరౌతారని ఐఎంఏ పేర్కొంది.