R Value: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగుచూసిన తర్వాత పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు రెండు మూడు రోజుల్లోనే రెట్టింపు కావడం కలవరం రేపుతున్నది. కరోనా వైరస్ ఆర్-వ్యాల్యూ (రీ ప్రొడక్షన్ రేటు) సైతం పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.
R Value: భారత్ లో మళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ సైతం చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. రోజురోజుకూ ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే ఒమిక్రాన్ ఇదివరకటి వేరియంట్ల కంటే రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్నది. అలాగే, దీనిని అత్యంత ప్రమాదకరమైనదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. పరిస్థితులను దారుణంగా మారుస్తున్నాయి. ఇక భారత్ లోనూ ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే దేశంలోని 22 కు పైగా రాష్ట్రాలకు వ్యాపించింది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆయా రాష్ట్రాలు వెల్లడిస్తున్న గణాంకాలను గమనిస్తే స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా కట్టడి చర్యల గరించి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. హెచ్చరించింది.
Also Read: కర్నాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం హవా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ !
undefined
కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం పదుల సంఖ్యలో నమోదుకావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా, దేశరాజధాని ఢిల్లీ, ముంబయి నగరాల్లో కరోనా వైరస్ ఆర్-విలువ (రీ-ప్రొడక్షన్ రేటు) 2 దాటినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా ఆయా నగరాల్లో విస్తృత వేగంతో వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు పేర్కొనడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ (R Factor) ద్వారా అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 1గా ఉంటే ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి (సరాసరి) మరొకరికి సోకుతున్నట్లు పరిగణిస్తారు. 1 కంటే తక్కువగా ఉంటే మాత్రం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఆర్-వ్యాల్యూ (రీ ప్రొడక్షన్ రేటు)పెరుగుతున్నదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశంలో కరోనా వైరస్ విస్తరణపై చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ముంబయి, ఢిల్లీ నగరాల్లో కరోనా వైరస్ ఆర్-వ్యాల్య్వూ (రీ ప్రొడక్షన్ రేటు) గురించి వెల్లడిస్తూ.. ఆర్-విలువ 2 దాటినట్లు పేర్కొంది. ఈ నెల 23-29 తేదీల మధ్య ఢిల్లీలో ఆర్-విలువ 2.54గా నమోదు అయింది. ముంబయిలో 2.01గా నమోదైంది. పుణె, బెంగళూరు నగరాల్లో ఆర్ విలువ 1.11గా నమోదు కాగా కోల్‌కతాలో 1.13, చెన్నైలో 1.26గా ఉందని ఐఎంఎస్ పరిశోధకుల బృందం పేర్కొంది. అక్టోబర్ రెండోవారం తర్వాత ఈ నగరాలన్నింటిలో కరోనా వైరస్ ఆర్-వ్యాల్యూ (రీ ప్రొడక్షన్ రేటు)1 కంటే ఎక్కువగా ఉంది. కానీ, ఢిల్లీ, ముంబయి నగరాల్లో తాజాగా ఆర్-విలువ 2 దాటడం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఐఎంఎస్ శాస్త్రవేత్త సితభ్రా సిన్హా అన్నారు. కాగా, ఢిల్లీలో కొత్తగా నమోదైన కేసులు అంతకు ముందు రోజుతో పోలిస్తే 86 శాతం అధికం. ఈ విధంగా కరనా వైరస్ ఉధృతి ఏడు నెలల తర్వత ఇదే మొదటిసారి.
Also Read: Omicron: మహారాష్ట్రలో ఒక్కరోజే 198 ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్ర మంత్రిని వదలని మహమ్మారి !