భారత మహిళలు ఇప్ప‌టికీ జ‌ల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తారు - రాజ‌స్థాన్ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

By team teluguFirst Published Aug 21, 2022, 11:38 AM IST
Highlights

రాజస్థాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ భారత మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చైనా, అమెరికాలోని మహిళలు సైన్స్ వరల్డ్ లో జీవిస్తుంటే, మన దేశంలో మహిళలు ఇంకా పురాతన ఆచారాలను పాటిస్తున్నారని అన్నారు. 

అభివృద్ధి చెందిన దేశాల్లోని మ‌హిళ‌లు సైన్స్ ప్రపంచంలో జీవిస్తుంటే.. భారత్ లోని మ‌హిళ‌లు ఇప్ప‌టికీ జ‌ల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భ‌ర్త ధీర్ఘాయువు కోసం (కర్వా చౌత్‌) ప్రార్థించడం దురదృష్టకరమని రాజస్థాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఈ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి. బీజేపీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయ్యింది. మంత్రిపై విమ‌ర్శ‌లు చేసింది.

హిమాచల్ ప్ర‌దేశ్ లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. 19 మంది మృతి.. పలువురు గల్లంతు

‘‘ చైనా, యూఎస్‌లోని మహిళలు సైన్స్ ప్రపంచంలో నివసిస్తున్నారు. కానీ నేటికీ కర్వా చౌత్‌లో మహిళలు జల్లెడ ద్వారా చూడటం, వారి భర్త సుదీర్ఘ ఆయుష్షు గురించి మాట్లాడటం దురదృష్టకరం. కానీ తన భార్య దీర్ఘాయువు కోసం భర్త ఎప్పుడూ జల్లెడ మాత్రం చూడరు. ప్రజలు (ఇతరులను) మూఢనమ్మకాలలోకి నెట్టివేస్తున్నారు, వారు మతం, కులం పేరుతో ఇతరులను పోరాడేలా చేస్తున్నారు ’’ అని మంత్రి అన్నారు. ఆయ‌న రాజ‌స్థాన్ కేబినేట్ లో విపత్తు నిర్వహణ సహాయ మంత్రిగా గోవింద్ రామ్ మేఘ్వాల్ కొనసాగుతున్నారు. ‘డిజిఫెస్ట్’ ముగింపు కార్యక్రమంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో గెహ్లాట్ కూడా ఆ వేదిక‌పైనే ఉన్నారు.

గుజరాత్ లో సెల్ ఫోన్ గొడవ... కొడుకుపై కన్నతండ్రి కాల్పులు

ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రాంలాల్ శర్మ స్పందించారు. వ్యోమగామి కల్పనా చావ్లా అంతరిక్షయాత్రకు వెళ్లారని, ఎంతో మంది భారతీయ మహిళలు పైలట్‌లుగా పనిచేస్తున్నారని ఆయన తెలుసుకోవాలని మంత్రిపై మండిపడ్డారు. దేశంలోని కోట్లాది మంది మహిళలను ఆయన అవమానించారని, క్షమాపణలు చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని తెలిపారు. మంత్రిపై సీఎం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శర్మ అన్నారు. భారతీయ మహిళలు సంప్రదాయాలను పాటించడంలో ప్రసిద్ధి చెందారని, వారి వ్యక్తిగత జీవితం, వృత్తి మధ్య సమతుల్యతను పాటించడం వారికి తెలుసునని చెప్పారు. 

గుజ‌రాత్ మంత్రి వ‌ర్గంలో మార్పులు.. ఇద్దరు మంత్రుల నుంచి శాఖ‌ల తొల‌గింపు..

మంత్రి వ్యాఖ్య‌ల‌పై వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను శాస్త్రీయ దృక్పథాన్ని  విద్యను మాత్రమే ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. ‘‘ నేను కర్వా చౌత్‌కు వ్యతిరేకం కాదు. దానిని అనుసరించాలనుకునే వారు అనుసరించుకోవచ్చు. నేను శాస్త్రీయ స్వభావానికి ఉన్న ప్రాముఖ్యత విష‌యాన్ని మాట్లాడాను ’’ అని మంత్రి చెప్పారు. 

click me!