భారత ముస్లింలు జిహాద్‌, హింసకు ప్రాధాన్యత ఇవ్వరు, అందుకోసం ఖర్చు పెట్టరు: ఖాలీద్ జహంగీర్

Published : Jun 10, 2023, 02:37 PM ISTUpdated : Jun 10, 2023, 02:39 PM IST
భారత ముస్లింలు జిహాద్‌, హింసకు ప్రాధాన్యత ఇవ్వరు,  అందుకోసం ఖర్చు పెట్టరు: ఖాలీద్ జహంగీర్

సారాంశం

బహుళత్వం గల భారత నేలపై జీవించడం భారతీయ ముస్లింల అదృష్టమని ప్రముఖ రాజకీయ కార్యకర్త, కశ్మీరీ రచయిత ఖాలీద్ జహంగీర్ తెలిపారు. ప్రపంచంలో ఇస్లాం దేశాల ముస్లింలను అనుమానంతో చూస్తారని, అదే భారత ముస్లింలపై అలాంటి అనుమానాలు ఉండవని చెప్పారు.  

న్యూఢిల్లీ: తరుచూ విదేశీ పర్యటన చేసే ప్రముఖ రాజకీయ కార్యకర్త, కశ్మీరీ రచయిత ఖాలీద్ జహంగీర్.. తాను భారత ముస్లిం కావడం గర్వంగా అనిపిస్తుందని చెబుతారు. ఇస్లాం దేశాల పౌరుల పాస్ పోర్టులపై కత్తి, గద్దలతో చిత్రించిన భయంకర బొమ్మలుకనిపిస్తాయి. కొన్ని పాస్‌పోర్టులకు ఆకు పచ్చరంగు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉంటుంది. ఇది ముస్లిం మతాన్ని కలుపే సూచిక. కానీ, భారత దేశ పాస్ పోర్టు పై సత్యమేవ జయతే అనే నినాదం ఉంటుంది. ఈ స్లోగన్ భారతీయులందరినీ, ఆ మాటకొస్తే మతాలకు అతీతంగా మనుషులందరినీ కలిపే సూత్రం అని ఖాలీద్ జహంగీర్ తెలిపారు.

‘నా పాస్‌పోర్టు నేను భారతీయుడినని చెబుతుంది. అది నా ముఖ్యమైన అస్తిత్వాన్ని తెలుపుతుంది, కానీ, మతాన్ని చెప్పదు. మతం నా వ్యక్తిగతం’ అని దే స్నాచ్‌డ్ మై ప్లే గ్రౌండ్ అనే పుస్తక రచయిత జహంగీర్ తెలిపారు.

ఆవాజ్ ది వాయిస్‌తో కశ్మీర్‌లోని గందర్‌బల్‌కు చెందిన 46 ఏళ్ల రాజకీయ నేత జహంగీర్ మాట్లాడుతూ.. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తాను సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దాటి వెళ్లుతారని వివరించారు. అదే పాకిస్తాన్, సిరియా సహా పలు ముస్లిం దేశాల పౌరులను ఆ దేశ ఉన్నత అధికారులను కూడా ప్రత్యేక క్యూ కట్టాలని ఆదేశించి మరీ ప్రశ్నలు వేస్తారని చెప్పారు. వారి పాస్‌పోర్టుకు సంబంధించిన పూర్వ విషయాలను అడిగి తెలుసుకుంటారు.

ఎందుకంటే సెక్యూరిటీ అధికారులు భారత్‌ను ఉగ్రవాదానికి, తీవ్ర వాద భావజాలానికి కేంద్రంగా భావించరు. కాబట్టి, మన దేశ ముస్లింలు ఏ దేశ సమగ్రతకూ ముప్పుగా భావించరు. ఇటీవలే తాను యూరప్ ట్రిప్ వేశానని, తనను సాధారణ ప్రశ్నలు వేసి లోనికి అనుమతించిన అధికారులు పాకిస్తాన్ ప్రతినిధులను మాత్రం ప్రత్యేక క్యూలో నిలబెట్టి సమగ్రంగా వివరాలు అడిగారు. భారత పాస్‌పోర్టుకు గౌరవం ఉండగా అనేక ముస్లిం దేశాల పాస్‌పోర్టు హోల్డర్లను మాత్రం అనుమానాస్పదంగా చూస్తారు.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ చైర్మన్ జహంగీర్ ఒక కశ్మీరీగా మాట్లాడుతూ.. తమ పుట్టిన భూమిపై హింస, ఇక్కడి యువత ఉగ్రవాదంలో చేరడం చూస్తున్నామని వివరించారు. అయితే.. తీవ్రవాదం, ఇస్లాం తిరుగుబాటుల తరహాలో కశ్మీరీలు యుద్ధం కోసం ఆయుధాలు కొనుగోలు చేయాలని తమ ఆస్తులను అమ్ముకోరని చెప్పారు. వారి చేతికి పాకిస్తాన్ ఆయుధాలు ఇస్తుందని తెలిపారు. కశ్మీర్‌లో మూడు దశాబ్దాలుగా తీవ్రవాదం కొనసాగుతున్నదని, కానీ, యెమెన్, సిరియా తరహా మారే పరిస్థితులు మాత్రం లేదని చెప్పారు.

కశ్మీర్‌లో హింసను పరిశీలిస్తే ఇక్కడ జిహాద్ కోసం ఒక్క అంగుళం భూమి అమ్ముకోలేదని తెలిపారు. భారత ముస్లింలు హింసకు డబ్బులు ఖర్చు పెట్టుకోరని వివరించారు. అయితే, కొందరు తీవ్రవాదులకు మాత్రం పాకిస్తాన్ ఆయుధాలు అందిస్తున్నదని పేర్కొన్నారు.

అదే 9/11 తర్వాత ఇరాక్, సిరియా, ఇరత ఇస్లాం దేశాలు, ఒసామా బిన్ లాడెన్ వారికున్నవన్ని అమ్మేసుకుని ఆయుధాలు కొనుక్కున్నాయని జహంగీర్ తెలిపారు. ఇక్కడ కశ్మీర్‌లో జిహాద్‌కు పోస్టర్ బాయ్‌గా పేరొందిన బుర్హన వనీ కూడా గన్‌ల కోసం ఏమీ అమ్ముకోలేదని, కానీ, ఆయనకు గన్‌లు ఇచ్చారని వివరించారు.

Also Read: పుట్టిన గడ్డతో భారతీయ ముస్లింలది భావోద్వేగ సంబంధం.. సాంస్కృతికంగా పెనవేసుకున్నారు!

దేశంలోని ముస్లింలు అందరి కంటే కూడా కశ్మీరీ ముస్లింలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కశ్మీరీ ముస్లింలు ముఘల్స్‌ను కీర్తించరని వివరించారు. కశ్మీరీ ముస్లింల ఆహారం, సాంప్రదాయాలు, భాషలు భిన్నమైనవి. కొందరైతే వారి బ్రాహ్మణ పూర్వీకులను ఇప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. వారి హిందు పేర్లనూ ఇంకా మరిచిపోరు. కశ్మీర్‌లో ఇస్లాం బలవంతపు మార్పిడితో రాలేదని వివరించారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తుండగా.. భారత ముస్లింలు మెజార్టీ హిందువులతో ముప్పు ఉన్నదని భావిస్తారని, అదే కశ్మీరీ ముస్లింలు పాకిస్తాన్ 1989లో జోక్యానికి ముందు వరకు శాంతియుతంగా ఉన్నారని చెప్పారు.

బహుళత్వం గల ఈ నేలపై జీవించడం భారత ముస్లింల అదృష్టమని ఆయన చెప్పారు. కానీ, కశ్మీర్‌లో మాత్రమే ఈ బహుళత్వం కరిగిపోతున్నదని తెలిపారు. తాను చిన్నప్పుడు కశ్మీరీ పండిట్లతో కలిసి పెరిగారని, కానీ, ఇప్పుడు తమ పిల్లలకు అలాంటి వాతావరణం లేదని వివరించారు.

 

 

--- ఆశా కోసా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌