గుర్రాలు, కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్ ఇచ్చి.. 4 రోజులు బంధించి, పలుమార్లు అత్యాచారం.. వీడియోతీసి, బ్లాక్ మెయిల్...

Published : Jun 10, 2023, 02:12 PM IST
గుర్రాలు, కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్ ఇచ్చి.. 4 రోజులు బంధించి, పలుమార్లు అత్యాచారం.. వీడియోతీసి, బ్లాక్ మెయిల్...

సారాంశం

గుర్రాలు, కుక్కలు ఇచ్చే మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఓ యువతిని కిడ్నాప్ చేసి.. పలుమార్లు అత్యాచారం చేశారో కీచకుడు. వాటన్నింటిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు.  

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ కామాంధుడు క్రూరత్వానికి ఒడిగట్టాడు. గుర్రాలకు వాడే ఇంజక్షన్ ను ఇచ్చి ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కాన్పూర్ లోని ఫజల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షో రూమ్ లో పనిచేస్తుంది. అర్జున్ సింగ్ అనే నిందితుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అతను కిద్వాయ్ నగర్ కు చెందిన వ్యక్తి.  మంచిగా మాట్లాడి, మాయ మాటలతో ఆమెకు దగ్గరయ్యాడు.

అలా కొద్ది రోజులు మాటలతో గడిచిన తర్వాత ఒకసారి కలుద్దాం అంటూ ఆమెను పిలిచాడు. తాను చెప్పిన ప్రాంతానికి వచ్చిన ఆమెకు.. గుర్రాలు, కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్ ఇచ్చి.. ఆ తర్వాత ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను అలాగే గదిలో నాలుగు రోజుల పాటు బంధించాడు. పదేపదే అత్యాచారానికి తెగబడ్డాడు. దీన్నంతా వీడియో తీశాడు.

ఒడిశా రైలు ప్రమాదం.. బోగీల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికుల ఆందోళన.. అధికారులు ఏం చెప్పారంటే ?

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడంతో భయపడిపోయిన బాధితురాలు ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదు. తర్వాత కొద్ది రోజులకు అతను మళ్ళీ ఫోన్ చేశాడు. తన దగ్గరకు రావాలని తెలిపాడు. ఆమె రాకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని మళ్లీ బెదిరించాడు.

ఒక్కసారిగా గతంలో తాను అనుభవించిన నరకం గుర్తుకొచ్చిన ఆ బాధితురాలు చివరికి పజల్ గంజ్ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత కూడా జూన్ 6వ తేదీన వేరువేరు నెంబర్లనుంచి బాధితుకురాలికి నిందితుడు ఫోన్లు చేశాడు. తన మాట వినకుంటే యాసిడ్ తో దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తన తరఫున ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంది. ఆయన పోలీస్ కమిషనర్ కు ఈ విషయం మొత్తాన్ని ఫిర్యాదు చేశారు.

 విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ నిందితుడు మీద చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.  నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని.. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌