భారత విమానయాన మార్కెట్ అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోంది: స్టార్ అలయన్స్ సీఈవో

By Mahesh Rajamoni  |  First Published Jun 11, 2023, 3:06 PM IST

New Delhi: భారత విమానయాన మార్కెట్ అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందని స్టార్ అలయన్స్ సీఈవో థియో పనాజియోటోలియాస్ అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటిగా నిలిచింద‌ని ఇటీవ‌లి రిపోర్టులు పేర్కొంటున్నాయి. కోవిడ్ -19 ప్రభావానికి గురైన తరువాత దేశీయ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ లో బలమైన రికవరీని చూసింది. 
 


India's aviation market: భారత విమానయాన మార్కెట్ అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందని స్టార్ అలయన్స్ సీఈవో థియో పనాజియోటోలియాస్ అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటిగా నిలిచింద‌ని ఇటీవ‌లి రిపోర్టులు పేర్కొంటున్నాయి. కోవిడ్ -19 ప్రభావానికి గురైన తరువాత దేశీయ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ లో బలమైన రికవరీని చూసింది. 

వివ‌రాల్లోకెళ్తే.. అన్ని రకాల అవకాశాలతో వృద్ధికి భారతదేశం కీలకమైన విమానయాన మార్కెట్ అనీ, ఎయిర్ ఇండియా తన వ్యాపారాన్ని సమూలంగా మార్చడానికి బలమైన మిషన్ లో ఉందని ఎయిర్లైన్స్ గ్రూప్ స్టార్ అలయన్స్ సిఈవో థియో పనాజియోటోలియాస్ చెప్పారు. ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, సింగపూర్ ఎయిర్ లైన్స్, దక్షిణాఫ్రికా ఎయిర్ లైన్స్ తో సహా 25 విమానయాన సంస్థల ప్రపంచ సమూహం స్టార్ అలయన్స్ 26 సంవత్సరాలకు పైగా త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది. 

Latest Videos

కూటమిలో దీర్ఘకాలంగా సభ్యదేశంగా ఉన్న ఎయిరిండియా పునరుద్ధరణపై ఆశాభావం వ్యక్తం చేసిన పనాజియోటౌలియాస్, ఎయిర్ లైన్స్ చాలా బలమైన మిషన్ లో ఉందనీ, దాని వ్యాపారంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. భారత్ కీలకమైన వృద్ధి మార్కెట్ అనీ, అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా కూటమిలో ఉండటం ప్రపంచ నెట్ వ‌ర్క్ పెద్ద పజిల్ అని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 470 విమానాలకు చారిత్రాత్మక ఆర్డర్ ఇవ్వడం, సేవలను విస్తరించడం సహా ఎయిరిండియా తన కార్యకలాపాలను బలోపేతం చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి తర్వాత వేగంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో రికవరీ జరిగిందని పనాజియోటౌలియాస్ చెప్పారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం కంటే ఉత్తర అమెరికా-ఐరోపా చాలా త్వరగా కోలుకున్నాయని వ్యాఖ్యానించారు. మహమ్మారి తర్వాత ప్రీమియం ప్రయాణాలు పెరుగుతున్నాయా అనే ప్రశ్నకు స్టార్ అలయన్స్ చీఫ్ అవుననే సమాధానమిచ్చారు. "ప్రీమియం ట్రావెల్ పెరిగింది, ముఖ్యంగా లీజర్ ప్రీమియం పెరిగింది. కార్పొరేట్ ప్రీమియం కాదు. ప్రీమియం క్యాబిన్ లో వ్యక్తిగత అనుభవాల కోసం ఖర్చు చేయాలనుకునే వారిని చాలా మంది చూస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

click me!