
Madhya Pradesh Election: మధ్యప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారం షురూ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ రంగంలోకి దింపింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మహాకోశల్ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొనే భారీ రాజకీయ కార్యక్రమాలు వచ్చే మూడు రోజుల్లో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరగనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటినుంచే గెలుపు కోసం వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
వివరాల్లోకెళ్తే.. నర్మదా నది ఒడ్డున ప్రార్థనలు చేసిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం జబల్ పూర్ నుండి త్వరలో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. జబల్ పూర్ రాష్ట్రంలోని మహాకోశల్ ప్రాంతానికి కేంద్రంగా ఉంది.. ఇక్కడ గణనీయమైన సంఖ్యలో గిరిజన ఓటర్లు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో, ఎనిమిది జిల్లాల డివిజన్లోని 11 షెడ్యూల్డ్ తెగల రిజర్వ్డ్ సీట్లలో కాంగ్రెస్ 13 గెలుచుకుంది. మిగిలిన రెండింటిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుచుకుంది.
ఎనిమిది జిల్లాలు ఉన్న మహాకోశల్ ప్రాంతం లేదా జబల్ పూర్ డివిజన్ లోని ప్రజలు బీజేపీ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మేము (గతసారి) ఈ ప్రాంతంలో బాగా పనిచేశాము. ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. పార్టీ ప్రచార ప్రారంభానికి జబల్పూర్ ను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దాని గుండా వెళ్లనందున మహాకోశల్ లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ టంఖా చెప్పారు. మహాకోశల్ ప్రాంతంలో జరిగే ర్యాలీ పొరుగున ఉన్న వింధ్, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మహాకోశల్ లో బీజేపీ ప్రభుత్వానికి బలమైన వ్యతిరేకత ఉందనీ, కాంగ్రెస్సాం ప్రదాయ గిరిజన ఓటర్లలో ఎక్కువ భాగం ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్ లో మహాకోశల్, గ్వాలియర్-చంబల్, మధ్య భారతదేశం, నిమార్-మాల్వా, వింధ్, బుందేల్ఖండ్ అనే ఆరు ప్రాంతాలు ఉన్నాయి. మహాకోశల్ లేదా జబల్ పూర్ డివిజన్ లో జబల్ పూర్, కట్ని, సియోని, నర్సింగ్ పూర్, బాలాఘాట్, మాండ్లా, దిండోరి, చింద్వారా జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 38 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 24 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 13 స్థానాలను గెలుచుకోగలిగింది. ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు. 2013 ఎన్నికల్లో బీజేపీ 24, కాంగ్రెస్ 13 స్థానాల్లో విజయం సాధించాయి.