బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ సమక్షంలోనే బీజేవైఎం చీఫ్ ను చితకబాదిన సొంత పార్టీ నాయకుడి మద్దతుదారులు.. ఎందుకంటే ?

Published : Jun 11, 2023, 02:50 PM IST
బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ సమక్షంలోనే  బీజేవైఎం చీఫ్ ను చితకబాదిన సొంత పార్టీ నాయకుడి మద్దతుదారులు.. ఎందుకంటే ?

సారాంశం

మధ్యప్రదేశ్ లో బీజేపీకి చెందిన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేవైఎం ఇండోర్ జిల్లా అధ్యక్షుడు తన సహచర నేత తండ్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ నాయకుడి మద్దతుదారులు అతడిపై దాడి చేశారు. 

మధ్యప్రదేశ్ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు అదే పార్టీకి చెందిన మరో నాయకుడి తండ్రిని అవమానించారు. దీంతో ఆయన మద్దతుదారులు వచ్చి చితకబాదారు. ఈ ఘటన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి.. ఎక్కడంటే ?

భన్వర్కువాన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఇండోర్ యూనిట్ అధ్యక్షుడు అయిన సౌగతా మిశ్రా తన సంఘానికి చెందిన శుభేందర్ గౌడ్ తండ్రిని అవమానించారు. కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మద్దతు దారులకు కోపం వచ్చింది. అనంతరం గొడవ మొదలైంది.

ఆర్మీ జవాన్ భార్యకు అవమానం.. అర్ధనగ్నంగా చేసి 120 మంది చితకబాదారని, న్యాయం చేయాలని వీడియోలో హవిల్దార్ ఆవేదన..

ఈ క్రమంలో వారంతా ఒక్కసారిగా  సౌగతా మిశ్రా మీదకి వెళ్లి చితకబాదారు. అయితే ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వైభవ్ పవార్ అక్కడే ఉన్నారు. ఆయన ఉన్న సమయంలోనే సొంత పార్టీ నాయకులు మరో నాయకుడిని కొట్టడం చర్చనీయాంశం అవుతోంది. 
మొదట ఈ ఘటన సాధారణమేనని కొట్టిపారేసిన సౌగత మిశ్రా ఆ తర్వాత శుభేందర్ గౌడ్ ప్రోద్బలంతోనే గూండాలు దాడి చేశారని ఆరోపించారు.

జర్నలిస్టుతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాగ్వాదం.. వీడియో పోస్టు చేస్తూ మండిపడ్డ కాంగ్రెస్.. వైరల్

ఈ దృష్యాలన్నీ ఆ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటనను మొదట సాధారణమేనని కొట్టిపారేసిన సౌగత మిశ్రా.. ఆ తర్వాత శుభేందర్ గౌడ్ ప్రోద్బలంతోనే గూండాలు దాడి చేశారని ఆరోపించారు. కాగా.. ఈ ఘటనపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ తివారీ.. శుభేందర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసినట్లు బీజేవైఎం కార్యకర్త ఒకరు వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌