కౌరవపాండవులు: సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కవితను ట్వీట్ చేసిన ఆర్మీ

Siva Kodati |  
Published : Feb 26, 2019, 02:06 PM IST
కౌరవపాండవులు: సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కవితను ట్వీట్ చేసిన ఆర్మీ

సారాంశం

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని దాయాదీ దేశానికి గట్టి హెచ్చరిక చేసిన భారత్.. అన్నంత పని చేసింది. మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోని ఖైబర్ ప్రావిన్స్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులకు దిగింది. 

మిరాజ్-2000 యుద్ధ విమానాలు బాలాకోట్, ముజఫరాబాద్, చీకోట్‌లలోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విజయంపై భారత సైన్యం హర్షం వ్యక్తం చేసింది. ఓ హిందీ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆర్మీ ట్వీట్ చేసింది.

‘‘కౌరవులు, పాండవులను పోల్చుతూ సాగిన ఆ పద్యంలో శత్రువు ముందు తలొగ్గి ఉన్నామన్నంత మాత్రాన బలహీనులమని కాదు... మహాభారతంలో యుద్ధానికి దిగని పాండవులను కూడా కౌరవులు చేతగాని వారిగా భావించి నష్టపోయారంటూ ’’ సైన్యం ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu